AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram Srinivas: ఎట్టకేలకు క్రేజీ కాంబో సెట్.. ఆ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నా త్రివిక్రమ్.?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే డైలాగ్స్ ఆయన సినిమాల్లో స్పెషల్. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలే కాకుండా ఆయన చెప్పే మాటలు, ఇచ్చే స్పీచ్‌లు ఎప్పుడూ ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేస్తుంటాయి.

Trivikram Srinivas: ఎట్టకేలకు క్రేజీ కాంబో సెట్.. ఆ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నా త్రివిక్రమ్.?
Trivikram
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2026 | 3:09 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అరుదైన కలయికల్లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన జై చిరంజీవ సినిమాకు త్రివిక్రమ్ అందించిన కథ, పదునైన మాటలు చిరంజీవి కామెడీ టైమింగ్‌కు తోడై థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించాయి. ముఖ్యంగా చిరు, బ్రహ్మానందం మధ్య సాగే ట్రాక్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన త్రివిక్రమ్, మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం కోసం మాత్రం చాలాకాలంగా వేచి చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌పై పలుమార్లు ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. గతంలో త్రివిక్రమ్‌తో దానయ్యకు ఒక సినిమా చేసే కమిట్‌మెంట్ ఉంది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని వినియోగించుకుంటూ, మెగాస్టార్‌తో త్రివిక్రమ్‌ను కలిపేందుకు దానయ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.

దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. ఆ తర్వాత నన్ను హీరోగా పెట్టి సినిమా చేశాడు

ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరిగాయని తెలుస్తోంది. త్రివిక్రమ్ వినిపించిన ఒక ఆసక్తికరమైన కథాంశం చిరంజీవికి బాగా నచ్చడంతో, దాన్ని పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్‌గా సిద్ధం చేయమని మెగాస్టార్ సూచించినట్లు సమాచారం. అయితే ఇటు చిరు, అటు త్రివిక్రమ్ ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చేసింది రెండే రెండు సినిమాలు.. అందులో ఒకటి వెయ్యి కోట్లు.. ఇంకొకటి అట్టర్ ఫ్లాప్

ప్రస్తుతం త్రివిక్రమ్ ఫోకస్ అంతా ఎన్టీఆర్ మూవీ పైనే ఉంది. ఇటీవల వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రమైన జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని త్రివిక్రమ్ పట్టుదలగా ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలో సాగే ఈ భారీ పౌరాణిక చిత్రం ఆగిపోయిందంటూ వచ్చిన పుకార్లకు చెక్ పెడుతూ.. తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్, నిర్మాతలు కల్యాణ్ రామ్, ఎస్. రాధాకృష్ణ కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ ముగియగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘కాకా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనితో పాటు చిరు లైనప్‌లో మరికొందరు దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, చిరంజీవి- త్రివిక్రమ్- దానయ్య కాంబినేషన్‌లో సినిమా ఖాయమైతే కనుక, అది ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ పూర్తయిన తర్వాతే కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. అయితే, త్రివిక్రమ్ ఏమైనా మనసు మార్చుకుని గాడ్ ఆఫ్ వార్ కంటే ముందే ఈ ప్రాజెక్టును తెరపైకి తెస్తారా.? లేదా.? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే

అతని వల్లే జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది.. ఈ ఫీల్డ్‌లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు: నటి శ్రీవిద్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో