AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవకాయను తలదన్నే క్యాలిఫ్లవర్ పచ్చడి.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే రుచికి తిరుగులేదు!

Simple Cauliflower Pickle Recipe: మీకు ఎప్పుడూ ఆవకాయ, నిమ్మకాయ పచ్చడి తిని బోర్ కొడుతోందా.. అయితే ఈ సారి కొత్తగా క్యాలీఫ్లవర్ పచ్చడి ట్రై చేయండి. అవును క్యాలీఫ్లవర్‌తో కూడా నిలువ పచ్చడిని మీరు ఇంట్లోనే సులభంగా పెట్టుకోవచ్చు. అదెలానో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

ఆవకాయను తలదన్నే క్యాలిఫ్లవర్ పచ్చడి.. వేడి వేడి అన్నంలో కలిపి తింటే రుచికి తిరుగులేదు!
Cauliflower Pickle
Anand T
|

Updated on: Nov 14, 2026 | 3:07 PM

Share

నిలువ పచ్చళ్లు అంటే చాలా మంది ఇష్టపడుతారు. వీటిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. అయితే చాలా మందికి ఆవకాయ, నిమ్మకాయ, టమోటా పచ్చళ్ల గురించి మాత్రమే తెలుసు. కానీ క్యాలీఫ్లవర్‌తో కూడా నిలువ పచ్చడి పెట్టుకోవచ్చని మీకు తెలుసా? అవును క్యాలీఫ్లవర్ తో ఒక మంచి, రుచికరమైన పచ్చడిని తయారు చేసుకోవచ్చు. సరైన కొలతలతో ఈ పచ్చడిని తయారు చేస్తే, ఎక్కువ రోజులు పాడవకుండా తాజాగా ఉంటుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే అచ్చం ఆవకాయ ముద్దలా అనిపిస్తుంది.

క్యాలీఫ్లవర్ నిలువ పచ్చడికి కావాల్సిన పదార్థాలు

  • క్యాలీఫ్లవర్: 1 పెద్దది
  • పసుపు: 1 టీస్పూన్
  • మసాలా రుచికి కావాల్సినవి
  • కారం 1 కప్పు
  • ఉప్పు ½ కప్పు
  • ఆవపిండి ½ కప్పు
  • మెంతిపిండి : 1 టేబుల్ స్పూన్
  • నిమ్మరసం: 3 నుండి 4 పెద్ద నిమ్మకాయల రసం
  • వెల్లుల్లి రెబ్బలు: 15 నుండి 20

తాలింపు కోసం

  • వేరుశెనగ నూనె: 3/4 గ్లాసు
  • కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు: చిన్న వెల్లుల్లి ఒకటి
  • జీలకర్ర: 1/2 స్పూన్
  • ఆవాలు: 1 స్పూన్
  • ఎండుమిర్చి: కొద్దిగా
  • కరివేపాకు: కొద్దిగా

క్యాలీఫ్లవర్ నిలువ పచ్చడికి తయారీ విధానం

స్టెప్-1: ముందుగా క్యాలీఫ్లవర్ ను బాగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మరీ చిన్నవిగా ఉండకూడదు. కట్ చేసుకున్న ముక్కలను ఒక గ్లాసు లేదా గిన్నెతో కొలుచుకోవాలి. ఉదాహరణకు, మూడు గ్లాసుల ముక్కలను తీసుకోవచ్చు. ఇప్పుడు కొలుచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలపై బాగా మరిగించిన నీటిని పోసి, కేవలం ఒక్క నిమిషం పాటు అలా ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే ముక్కలు మెత్తబడిపోతాయి. ఒక నిమిషం తర్వాత ముక్కలను నీటి నుండి తీసివేయాలి

స్టెప్-2: ఇప్పుడు తీసిన ముక్కలను ఏదైనా శుభ్రమైన క్లాత్ పై పలుచగా పరచి ఆరబెట్టాలి. ఫ్యాన్ గాలిలో ఒకటి లేదా రెండు గంటలు, లేదా ఎండలో ఒక గంట ఆరబెడితే సరిపోతుంది. ముక్కల్లో తడి అస్సలు ఉండకూడదు, పూర్తిగా ఆరిపోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో పావు కప్పు పచ్చి ఆవాలను వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిని ఆవపిండి అంటారు.

స్టెప్-3: తర్వాత ఒక పెద్ద గిన్నెలో పూర్తిగా ఆరిన క్యాలీఫ్లవర్ ముక్కలను తీసుకోవాలి. అందులో అర గ్లాసు కారం, పావు గ్లాసు ఆవపిండి, పావు గ్లాసు ఉప్పు (కొద్దిగా తక్కువ వేసుకోవడం మంచిది, అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు), పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ పచ్చి మెంతులను వేసి బాగా కలపాలి.

స్టెప్-4: ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, ముప్పావు గ్లాసు వేరుశెనగ నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యాక, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, నూనె పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి. తాలింపు ఏమాత్రం వేడిగా ఉండకూడదు. పూర్తిగా చల్లారిన తాలింపును, ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మసాలా మిశ్రమంలో వేయాలి. అలాగే, పులుపుకు సరిపడినంత నిమ్మరసం కూడా వేసి అన్నింటినీ బాగా కలపాలి.

స్టెప్-5: ఇప్పుడు పచ్చడిని బాగా కలిపిన తర్వాత, గాలి తగలకుండా ఒక మూత పెట్టి, కనీసం ఒక రోజు పాటు ఊరనివ్వాలి. మరుసటి రోజు పచ్చడిని ఒకసారి కలుపుకొని, రుచి చూసి, అవసరమైతే ఉప్పు, కారం లేదా పులుపు సర్దుబాటు చేసుకోవచ్చు. నూనె సరిపోకపోతే కొద్దిగా వేడి చేసి చల్లార్చి కలుపుకోవచ్చు. ఈ పచ్చడిని శుభ్రమైన, పొడి జాడీలో నిల్వ చేస్తే రెండు నుండి మూడు నెలల వరకు పాడవకుండా ఉంటుంది. తడి చేతిని పచ్చడికి తగలకుండా చూసుకోవాలి. ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో