అరెరే పసుపు నీళ్లతో ఇన్ని ప్రయోజనాలున్నాయా? ఇన్నాళ్లు తెలీదే!

14 November 2026

Anand T

పసుపు.. దీని వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వంటలతో పాటు చర్మ సంరక్షణలో కూడా దీన్ని ఎక్కవగా వాడుతారు.

పసుపు

అయితే కొందరు పసుపును మార్నింగ్ నీటిలో కలుపుకొని కూడా తాగుతారు. ఇలా తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి

పసుపు వాటర్

పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఇమ్యూనిటీ

పసుపులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాతావరణ మార్పుల వల్ల వచ్చే జబ్బులను తగ్గిస్తాయి.

వ్యాధులకు చెక్

పరగడుపున గోరువెచ్చని పసుపు నీళ్లు తాగడం వల్ల కాలేయంలో పైత్యరసం ఉత్పత్తి పెరిగి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

మెరుగైన జీర్ణక్రియ

పసుపులో ఉండే కర్కుమిన్ మార్నింగ్ లేవగానే ఉండే ఒళ్లు నొప్పులు, కీళ్ల బిగుతును తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

కీళ్ల నొప్పుల

కూల్‌డ్రింక్స్ బదులుగా మార్నింగ్ లేవగానే పసుపు నీళ్లు తాగడం వల్ల మెటబాలిజం మెరుగుపడి, శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.

బరువు నియంత్రణ

 అంతేకాదు పసుపులో ఉండే కర్కుమిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.

చక్కెర నియంత్రణ