AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babu Mohan: ఆ హీరోయిన్ ఎంతో మంచిది.. ఆత్మీయురాలిని కోల్పోయా.. బాబూ మోహన్ ఎమోషనల్..

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బాబు మోహన్ దివంగత హీరోయిన్ తన తనకున్న అనుబంధాన్ని, ఆమెతో చేసిన సాంగ్స్ ,ఆమె ఇంటి విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కేవలం స్పెషల్ సాంగ్స్ చేసే నటిగానే అందరికీ తెలుసని, కానీ ఆమె నిజ జీవితంలో ఎంతో మంచి మనసున్న మనిసని ఆయన తెలిపారు. తనతో కలిసి పలు చిత్రాల్లో నటించడమే కాకుండా, తనను ఎంతో ఆప్యాయంగా "బాస్" అని పిలిచేదని ఆయన ఎమోషనల్ అయ్యారు.

Babu Mohan: ఆ హీరోయిన్ ఎంతో మంచిది.. ఆత్మీయురాలిని కోల్పోయా.. బాబూ మోహన్ ఎమోషనల్..
Babu Mohan
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2026 | 2:10 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన మాండలికం, ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సీనియర్ నటుడు బాబు మోహన్. దివంగత నటి సిల్క్ స్మితతో ఉన్న జ్ఞాపకాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. సిల్క్ స్మిత అంటే కేవలం స్పెషల్ సాంగ్స్ చేసే నటిగానే అందరికీ తెలుసని, కానీ ఆమె నిజ జీవితంలో ఎంతో మంచి మనసున్న మనిసని ఆయన తెలిపారు. తనతో కలిసి పలు చిత్రాల్లో నటించడమే కాకుండా, తనను ఎంతో ఆప్యాయంగా “బాస్” అని పిలిచేదని ఆయన ఎమోషనల్ అయ్యారు. చెన్నైలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకసారి సిల్క్ స్మిత తనను ఎంతో ఆప్యాయంగా తన ఇంటికి ఆహ్వానించినట్లు బాబు మోహన్ చెప్పారు. బయట ఎంతో గ్లామరస్‌గా కనిపించే ఆమె, ఇంట్లో మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉండేవారనడానికి ఆ ఇళ్లే నిదర్శనమని పేర్కొన్నారు. తన ఇంట్లోని గోడలకు రకరకాల డిజైన్లతో అద్భుతంగా డెకరేట్ చేసుకున్న తీరు ఆమె సృజనాత్మకతకు అద్దం పడుతుందని ఆయన అన్నారు. షూటింగ్ సెట్స్‌లో ఎంతో క్రమశిక్షణతో, తన పనేంటో తాను చూసుకునే సిల్క్ స్మిత అకస్మాత్తుగా మరణించడం తనను ఎంతగానో కలచివేసిందని, ఆమె రూపంలో ఒక మంచి ఆత్మీయురాలిని కోల్పోయామని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంఘటన జరిగిన రెండు మూడు నెలలకే సిల్క్ స్మిత మరణించారని బాబు మోహన్ గుర్తు చేశారు. ఆత్మీయుడిని కోల్పోయినట్లు తనకు అనిపించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇద్దరూ చాలా బిజీగా ఉండటంతో స్నేహంగా గడిపే సమయం ఉండేది కాదని, కలిసినప్పుడు మాత్రం ఆత్మీయంగా మాట్లాడుకునేవారని చెప్పారు. సిల్క్ స్మిత అప్పట్లో చాలా షిఫ్టులు, స్పెషల్ సాంగ్స్, పాత్రలతో తీరిక లేకుండా ఉండేవారని తెలిపారు.

ఆమెను గొప్ప డ్యాన్సర్, అత్యంత గౌరవనీయమైన వ్యక్తి అని ఆయన అన్నారు. సిల్క్ స్మిత గర్వంగా ఉంటుందన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఆమె గురించి అలా చెప్పేవారు “పిచ్చోళ్లే” అని స్పష్టం చేశారు. సిల్క్ స్మిత సాధారణంగా హీరోలతోనే పాటలు చేసేవారని, అయితే తనతో కలిసి చాలా పాటల్లో నటించారని బాబు మోహన్ గుర్తు చేశారు. ఆమెకున్న క్రేజ్‌కు తెరపై ఆమె అందమే కాదు, వ్యక్తిగత ప్రవర్తన, అంకితభావం కూడా కారణమని చెప్పారు. సెట్స్‌లో ఆమె చాలా నిశ్శబ్దంగా ఉంటూ, క్రమశిక్షణతో తన పని తాను చేసుకునేవారని తెలిపారు. అయితే తనతో మాత్రం “బాస్” అని ఆత్మీయంగా మాట్లాడేవారని అన్నారు. తెరపై వారి కెమిస్ట్రీ బాగా పండేదని, బయట కూడా మంచి స్నేహితులుగా ఉండేవారని చెప్పారు. తనకంటే ఆమె సీనియర్ అని కూడా పేర్కొన్నారు.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో