AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudha : అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. చాలా అల్లరి చేసేవాడు.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు.. టాలీవుడ్ నటి..

టాలీవుడ్ సీనియర్ నటి సుధ ఇప్పటివరకు వందలాది చిత్రాల్లో నటించి విలక్షణ నటిగా తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో బీజీ ఆర్టిస్టుగా ఉన్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలతో తనకున్న అనుబంధం.. అలాగే ఇప్పుడున్న హీరోలతో బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sudha : అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. చాలా అల్లరి చేసేవాడు.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు.. టాలీవుడ్ నటి..
Sudha
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2026 | 12:41 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నటులతో కలిసి పనిచేసిన అరుదైన ఘనత సాధించిన సీనియర్ నటి సుధ, ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో అగ్ర హీరోల సరసన, అమ్మ పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనం గురించి ఆమె చెప్పిన ఆసక్తికర విషయాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పెద్ద ఎన్టీఆర్ నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చిన్న పిల్లాడిగా సెట్స్‌కు వచ్చి కూర్చునేవాడని సుధ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తారక్ తన కళ్ళ ముందే పెరిగాడని, ఆయనను తాను ఎప్పుడూ తన సొంత కొడుకులాగే చూస్తానని ఆమె తెలిపారు. చిన్నతనంలో తారక్ చాలా అల్లరి చేసేవాడని, ఎవరినైనా ఇట్టే ఆటపట్టించేలా రాష్‌గా ఉండేవాడని ఆమె నవ్వుతూ చెప్పారు. ఆ రోజుల్లో కార్ వచ్చి ఆగిందంటే చాలు, పరుగున వచ్చి ఎవరి మీదో ఒకరి మీద పడి కొట్టేస్తాడేమో అనే భయం అందరిలోనూ ఉండేదని ఆమె సరదాగా పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని అన్నారు. ఇప్పుడు ఎవరితో ఎలా ఉండాలో.. కుటుంబ విలువలు పాటిస్తూ అందరితోనూ ఎంతో గౌరవంగా ప్రవర్తించే గొప్ప వ్యక్తిగా ఎదిగారని సుధ అన్నారు. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లోనూ ఆయన ఎంతో డౌన్ టు ఎర్త్ ఉంటారని చెప్పడానికి ఒక ఉదాహరణను ఆమె పంచుకున్నారు. ‘బాద్షా’ సినిమా షూటింగ్ సమయంలో డ్యాన్స్ చేస్తుండగా తన కాలుకు గాయమై స్ప్రేయిన్ రావడంతో, పెద్ద హీరో అయిన తారక్ ఏమాత్రం సంకోచించకుండా స్వయంగా పరుగున వచ్చి తన కాలు పట్టుకుని స్ప్రే వేశారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తోటి నటీనటులపై ఆయన చూపించే ఆదరాభిమానాలు, వినయమే నేడు ఆయనను పాన్ ఇండియా స్టార్‌ స్థాయికి చేర్చాయని సుధ చెప్పుకొచ్చారు.

అలాగే రామ్ చరణ్ చిన్నతనంలో ఎలా ఉండేవారనే విషయాలపై ఆమె ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ చాలా చిన్న పిల్లాడిగా సెట్స్‌కు వచ్చేవాడని సుధ తెలిపారు. ఆ రోజుల్లో చిన్నపిల్లాడిగా ఉన్న చరణ్‌ను తాను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నానని, అప్పట్లో ఎంతో అల్లరిగా తిరిగిన ఆ పిల్లాడు నేడు టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్‌గా ఎదగడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

సుధ, ఎన్టీఆర్..

Sudha, Jrntr

Sudha, Jrntr

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
అందని పూలు దేవుని కర్పణం..సామెత అసలు అర్థం తెలుసా?
అందని పూలు దేవుని కర్పణం..సామెత అసలు అర్థం తెలుసా?
జాగ్రత్తపడకపోతే మీ రిటైర్మెంట్ నగదు అంతా దోచేస్తారు జాగ్రత్త..
జాగ్రత్తపడకపోతే మీ రిటైర్మెంట్ నగదు అంతా దోచేస్తారు జాగ్రత్త..
15 బంతుల్లో స్కై విధ్వంసం.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్..?
15 బంతుల్లో స్కై విధ్వంసం.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్..?
ఏముంది మావ ఈ సాంగ్.. ఆర్జీవీ ఫేవరెట్ సాంగ్.. ఇంతకీ మీరు విన్నారా.
ఏముంది మావ ఈ సాంగ్.. ఆర్జీవీ ఫేవరెట్ సాంగ్.. ఇంతకీ మీరు విన్నారా.
గీజర్‌ను ఆన్ చేసేటప్పుడు ఈ సాంకేతాలు కనిపిస్తే వెంటనే ఆఫ్‌ చేయండి
గీజర్‌ను ఆన్ చేసేటప్పుడు ఈ సాంకేతాలు కనిపిస్తే వెంటనే ఆఫ్‌ చేయండి
కారు బ్రేక్‌డౌన్.. కంత్రీ గాళ్ల ప్లాన్ ఫ్లాప్
కారు బ్రేక్‌డౌన్.. కంత్రీ గాళ్ల ప్లాన్ ఫ్లాప్
పాకిస్తానీ యువతికి భారత్‌పై అంత ప్రేమా?
పాకిస్తానీ యువతికి భారత్‌పై అంత ప్రేమా?
కెప్టెన్‌గా తొలి మ్యాచ్.. కట్‌చేస్తే.. వైభవ్‌కు ఊహించని షాక్
కెప్టెన్‌గా తొలి మ్యాచ్.. కట్‌చేస్తే.. వైభవ్‌కు ఊహించని షాక్
అనిరుధ్ సింపుల్ లైఫ్ స్టైల్ చూస్తే ఫిదా కావాల్సిందే..
అనిరుధ్ సింపుల్ లైఫ్ స్టైల్ చూస్తే ఫిదా కావాల్సిందే..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో