ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశా.. పిలిచి తిడతాడనుకుంటే ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయా.. ఎంఎస్ నారాయణ..
దివంగత ప్రముఖ నటుడు, కమెడియన్ ఎంఎస్ నారాయణ కామెడీ టైమింగ్, యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన తనయుడిని స్వయంగా పరిచయం చేయడం దగ్గర్నుంచి స్టార్ హీరోను ఇమిటేట్ చేయడం వరకు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్‌తో, వైవిధ్యమైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన లెజెండ్రీ నటుడు ఎంఎస్ నారాయణ. కేవలం కమెడియన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆయన ఎన్నో చిరస్మరణీయ పాత్రలు పోషించారు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్, మేనరిజం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న కొన్ని మధుర జ్ఞాపకాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఇమిటేట్ చేయడం గురించి మాట్లాడుతూ, తాను కృష్ణ గారిని చాలా అద్భుతంగా ఇమిటేట్ చేసేవాడినని ఎంఎస్ నారాయణ తెలిపారు. ఒకసారి కృష్ణగారు స్వయంగా తనను పిలిచి, తన స్టైల్‌ని ఎలా అనుకరిస్తావో మళ్లీ చేసి చూపించమని అడిగాడట. మొదట తాను కొద్దిగా భయపడినప్పటికీ, ఆయన ఎంతో సరదాగా తీసుకుని తనను ఎంకరేజ్ చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆయన విజయనిర్మల గారిని పిలిచి “ఇతను అల్లు రామలింగయ్యలా అవుతాడు” అని చెప్పారని నారాయణ గుర్తు చేసుకున్నారు. ఈ మాటలతో తాను ఎంతో ఆశ్చర్యపోయానని అన్నారు. ఇతర నటులను అనుకరించే, వ్యంగ్యంగా చూపించే పేరడీ పాత్రలను తాను పూర్తిగా ఆస్వాదిస్తానని ఎం.ఎస్. నారాయణ చెప్పారు. దర్శకుడు చెప్పిన పని చేయడం నటుడిగా తన బాధ్యత అని, దానికి తనకు ప్రతిఫలం వస్తుందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరిని అనుకరించినా వారు చాలా సహృదయులని, “మీరు అలా ఎలా చేశారు?” అని అడిగేవారు లేరని ఆయన అన్నారు.
తన కుమారుడిని సినిమాల్లోకి పరిచయం చేసిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ఇతర దర్శకులు తన కుమారుడిపై నమ్మకం చూపకపోవడంతో, తానే దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తన బిడ్డ సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, దేవుడు ఇచ్చిన సంపదలో కొంత ఖర్చు చేసి సినిమా తీశానని వివరించారు. ఆ సినిమా విజయం సాధించకపోవడానికి కారణం సరైన ప్రమోషన్ లేకపోవడమే అని ఎం.ఎస్. నారాయణ స్పష్టం చేశారు. అది తన దర్శకత్వ లోపం కాదని అన్నారు. ఆ చిత్రం టీవీలో దాదాపు 50 సార్లు ప్రసారమైందని కూడా చెప్పారు. ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘కొడుకు’. అందులో ఆయన కుమారుడు విక్రమ్ హీరోగా నటించారు. ఈ సినిమా 2007లో వచ్చింది.
జీవితంలో తనను బాధపెట్టిన సంఘటనల గురించి కూడా ఎం.ఎస్. నారాయణ మాట్లాడారు. తనకంటే చిన్నవారైన బంధువులు ముందే చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. పదిమంది తోబుట్టువుల్లో చివరి వారైన తన చెల్లెలి మరణం తనను ఎంతో కలచివేసిందని చెప్పారు. అప్పుడు తాను చిన్న ఉపాధ్యాయుడిగా, చాలీచాలని జీతంతో కష్టపడుతున్నానని గుర్తు చేసుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో చెల్లెలికి ఆర్థికంగా ఏమీ ఇవ్వలేకపోయానని, ఇప్పుడు ఆమె బతికి ఉంటే ఎంతో ఇచ్చేవాడినని బాధపడ్డారు. ఎంఎస్ నారాయణ 700కు పైగా సినిమాల్లో నటించారు. ‘మా నాన్నకి పెళ్లి’, ‘రామ్స్కానోడు’, ‘సర్దుకుపోదాం రండి’, ‘శివమణి’, ‘దూకుడు’ చిత్రాల్లోని హాస్య నటనకు ఐదు నంది అవార్డులు అందుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
