కళ్లముందే భగ్గుమన్న కారు.. మృత్యువు అంచుల్లో డ్రైవర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు!
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ CNG కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు కారంతా వ్యాపించడంతో డ్రైవర్ అందులోనే చిక్కుకుపోయాడు. అతడి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే స్పందించి ప్రాణాలకు తెగించి బయటకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది.

ట్రయల్ చేస్తుండగా ప్రమాదం..!
వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ కాలనీలో రవి అనే మెకానిక్ కారును ట్రయల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. కారులో CNG సిలిండర్ ఉండటంతో ప్రమాదం జరిగిన వెంటనే నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. అనంతరం CNG వ్యవస్థలో పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో క్షణాల్లోనే కారు మొత్తం మంటల్లో చిక్కుకుంది.
డ్రైవర్ ఆర్తనాదాలు.. స్థానికుల సాహసం!
కారులో ఉన్న రాజు మంటల మధ్య చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేయడంతో సమీపంలోని స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే కారులో నుంచి అతడిని బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. తీవ్ర గాయాలపాలైన రాజును చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.
స్థానికులు సకాలంలో స్పందించడంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో సోఫీనగర్ కాలనీలో కొద్దిసేపు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వీడియో ఇక్కడ చూడండి
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..