AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కివీస్‌లోనే కెరీర్ ముగించనున్న హిట్‌మ్యాన్..?

Rohit Sharma ODI Form: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఏమాత్రం కలిసిరావడం లేదు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన హిట్‌మ్యాన్ కేవలం 23 పరుగులే చేశాడు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌లో అతడి స్థానం గురించి చర్చ మొదలైంది. మరోవైపు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ప్రత్యామ్నాయంగా పరిశీలించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Rohit Sharma: రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కివీస్‌లోనే కెరీర్ ముగించనున్న హిట్‌మ్యాన్..?
Rohit Sharma Odi Form
Venkata Chari
|

Updated on: Nov 14, 2026 | 1:18 PM

Share

Rohit Sharma ODI Form: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) కెరీర్‌పై మరోసారి చర్చ మొదలైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో హిట్‌మ్యాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన రోహిత్ కేవలం 23 పరుగులే చేశాడు. ఇందులో రెండు సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ ప్రదర్శనతో 2027 వన్డే ప్రపంచకప్‌లో అతడి స్థానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పేరు తెరపైకి వచ్చింది. కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ భవిష్యత్ ప్రణాళికల్లో యశస్వికి ప్రాధాన్యం ఇవ్వవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

నాలుగు మ్యాచ్‌ల్లో 23 పరుగులే..!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ అభిమానులను నిరాశపరిచింది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు మొత్తం 23 పరుగులే చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మరో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేశాడు. కీలకమైన ఓపెనింగ్ స్థానంలో ఉన్న రోహిత్ ఇలా వరుసగా విఫలమవడం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగించే అంశం. ఆదివారం జరగనున్న ఐదో వన్డేలో అతడి ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.

ఎక్కువమంది చదివినది: Year Ender 2026: 11 సిక్సర్లు, 9 ఫోర్లు.. 30 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. రోహిత్ రికార్డును చెరిపేసిన అభిషేక్ శర్మ..!

ఇవి కూడా చదవండి

రోహిత్ స్థానంలో యశస్వికి అవకాశం?

మరోవైపు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా పరిశీలించవచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న యశస్వి పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. భారత జట్టు తరఫున ఇప్పటివరకు ఆరు వన్డేలు ఆడిన అతడు 285 పరుగులు సాధించాడు. ఈ గణాంకాలు అతడిలోని ప్రతిభను సూచిస్తున్నాయి. ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం కూడా జట్టుకు మరో ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

2027 ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ ఆడతాడా?

2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉండటంతో ఇప్పుడే రోహిత్ శర్మ భవిష్యత్తుపై తుది నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. అతడి అనుభవం, గత రికార్డులు టీమిండియాకు ఎంతో కీలకం. అయితే ప్రస్తుత ఫామ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. మరోవైపు యశస్వి జైస్వాల్‌కు వన్డేల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తే తన స్థానాన్ని బలోపేతం చేసుకునే వీలుంటుంది.

ఎక్కువమంది చదివినది: IND vs NZ 5th ODI: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హమ్మయ్య చివరి వన్డే ఇక మనదే.. ఆ దరిద్రం పోయిందిగా..!

ప్రస్తుతం అందరి చూపు న్యూజిలాండ్‌తో జరగనున్న చివరి వన్డేపైనే ఉంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడితే విమర్శలకు సమాధానం చెప్పినట్లవుతుంది. లేదంటే ప్రపంచకప్ ఓపెనింగ్ స్థానంపై చర్చ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే రోహిత్‌ను తప్పించి యశస్విని ఎంపిక చేయాలని గంభీర్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

మరిన్ని క్రీడ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కివీస్‌లోనే కెరీర్ క్లోజ్..!
రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కివీస్‌లోనే కెరీర్ క్లోజ్..!
సర్పంచ్ పదవికి కోసం కుమ్మరిస్తున్న ఆశావాహులు!
సర్పంచ్ పదవికి కోసం కుమ్మరిస్తున్న ఆశావాహులు!
గోల్డ్ ETFsలోకి పెట్టుబడుల వరద.. ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే?
గోల్డ్ ETFsలోకి పెట్టుబడుల వరద.. ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే?
ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశా.. ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయా..
ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశా.. ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయా..
ఫుడ్ బిజినెస్‌లో దంపతుల అదృష్టం.. 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం!
ఫుడ్ బిజినెస్‌లో దంపతుల అదృష్టం.. 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం!
వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!
వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!
గ్యాంగ్రీన్ ఎలా ముప్పుగా మారుతుంది?
గ్యాంగ్రీన్ ఎలా ముప్పుగా మారుతుంది?
యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!
యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో