AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పెయింట్ షాపులో భారీ అగ్ని ప్రమాదం.. మూడు భవనాలకు వ్యాపించిన మంటలు!

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్‌పేట్‌లో ఓ పెయింట్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పెయింట్ షాపులో మంటలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న మరో రెండు భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Hyderabad Massive Fire
Balaraju Goud
|

Updated on: Nov 14, 2026 | 8:22 AM

Share

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్‌పేట్‌లో ఓ పెయింట్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పెయింట్ షాపులో మంటలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న మరో రెండు భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పెయింట్ షాపులో మంటలు ఎగసిపడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ అగ్నిప్రమాదంలో పెయింట్ షాపుతో పాటు పక్కనే ఉన్న రెండు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదం కారణంగా సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊరట చెందారు.

మియాపూర్ పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టే అవకాశం ఉంది. అగ్నిప్రమాదంతో న్యూ హఫీజ్‌పేట్ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో