AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027 Auction: వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!

IPL 2027 Auction 5 Domestic Stars: డిసెంబర్ 17న జరగనున్న ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు యువ ఆటగాళ్లకు ఇదే అసలైన పరీక్ష. శనివారం ప్రారంభం కానున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2026లో సత్తా చాటి తొలి ఐపీఎల్ కాంట్రాక్ట్ కొట్టే అవకాశం ఉన్న ఐదుగురు అన్‌క్యాప్డ్ స్టార్లను ఓసారి చూద్దాం..!

IPL 2027 Auction: వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!
Smat 2026
Venkata Chari
|

Updated on: Nov 14, 2026 | 12:59 PM

Share

IPL 2027 Auction 5 Domestic Stars: దేశీయ క్రికెట్‌లో కలల వేటకు వేళాయె. భారత ప్రీమియర్ దేశీయ టీ20 టోర్నీ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2026 శనివారం, నవంబర్ 14 నుంచి ప్రారంభమైంది. మరో నెల రోజుల్లో, డిసెంబర్ 17న ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనున్న నేపథ్యంలో ఈ టోర్నీ ప్రాధాన్యత రెట్టింపైంది. ఫ్రాంచైజీల  కళ్లన్నీ ఇప్పుడు రాష్ట్ర జట్లపైనే.

ఇప్పటివరకు ఐపీఎల్‌లో అడుగుపెట్టని ఐదుగురు యువ ఆటగాళ్లు ఈసారి SMATను తమ భవిష్యత్తుకు నిచ్చెనగా మార్చుకోవాలని చూస్తున్నారు. వారెవరో, వారి బలమేమిటో చూద్దాం.

1. కార్తీక్ చద్దా (పంజాబ్) – గూగ్లీ గుండె చప్పుడు..

22 ఏళ్ల కుడిచేతి లెగ్ స్పిన్నర్ కార్తీక్ చద్దా ప్రస్తుతం దేశంలోనే అత్యంత ఆసక్తికరమైన యువ స్పిన్ ప్రాస్పెక్ట్. అతని ప్రధాన అస్త్రం గూగ్లీ. అంతేకాదు, కుడిచేతి బ్యాటర్ల నుంచి దూరంగా మళ్లే బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ లెగ్ బ్రేక్ కూడా వేయగలడు. గాల్లో వేగం, డ్రిఫ్ట్ రాబట్టడంలో అతని నియంత్రణ ఫ్రాంచైజీలను ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

2026 షేర్-ఏ-పంజాబ్ టీ20లో 10 మ్యాచుల్లో 14 వికెట్లు, 6.46 ఎకానమీతో సత్తా చాటాడు. ఇప్పుడు పంజాబ్ తరపున ప్రొఫెషనల్ టీ20 అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మిస్టరీ స్పిన్నర్ల కోసం వెతికే జట్లకు ఇతను లాటరీ కావచ్చు.

2. తుషార్ రహేజా (తమిళనాడు) – కీపర్ కమ్ రన్ మెషీన్..

తమిళనాడు టాప్ ఆర్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ తుషార్ రహేజా పేరు కొన్నేళ్లుగా వినిపిస్తోంది. కానీ ఈ SMAT 2026 అతనికి నిజమైన బ్రేక్ కావచ్చు. తమిళనాడు తరపున 9 టీ20ల్లో 223 పరుగులు, 24.77 సగటు, 165.18 స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: Year Ender 2026: 11 సిక్సర్లు, 9 ఫోర్లు.. 30 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. రోహిత్ రికార్డును చెరిపేసిన అభిషేక్ శర్మ..!

అసలు విశేషం TNPL 2026లో అతని విధ్వంసం. 8 ఇన్నింగ్స్‌ల్లో 70.33 సగటు, 190.09 స్ట్రైక్ రేట్‌తో 422 పరుగులు. ఇందులో నాలుగు 50+ స్కోర్లు, ఒక సెంచరీ. భారత టాప్ ఆర్డర్ కీపర్ల కోసం వెతికే జట్లకు రహేజా సరైన పరిష్కారంగా మారవచ్చు.

3. రుద్ర ప్రతాప్ దెహారీ (ఛత్తీస్‌గఢ్) – 19 ఏళ్ల వేగం..

ఛత్తీస్‌గఢ్ నుంచి టీ20 అరంగేట్రానికి సిద్ధమవుతున్న 19 ఏళ్ల పేసర్ రుద్ర ప్రతాప్ దెహారీపై ఇప్పటికే ముంబై ఇండియన్స్ వంటి ఫ్రాంచైజీ కన్నేసిందని సమాచారం.

ఛత్తీస్‌గఢ్ ప్రీమియర్ లీగ్ 2026లో 3 మ్యాచుల్లోనే 8 వికెట్లతో మూడో అత్యధిక వికెట్ల వేటగాడిగా నిలిచాడు. సగటు 12.25, ఎకానమీ 8.17. కొత్త బంతితో స్వింగ్, మధ్య ఓవర్లలో హార్డ్ లెంగ్త్, డెత్‌లో ఖచ్చితమైన యార్కర్లు వేయగల బహుముఖ ప్రజ్ఞ అతని సొంతం. SMATలో రాణిస్తే వేలం టేబుల్‌పై అతని పేరు మారుమోగడం ఖాయం.

4. రితిక్ తాడా (మధ్యప్రదేశ్) – నిలకడైన ఫినిషర్..

మధ్యప్రదేశ్‌కు చెందిన కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రితిక్ తాడా ఇన్నింగ్స్‌ను నిర్మించి, చివర్లో గేర్లు మార్చగల సమర్థుడు. అతని బాటమ్ హ్యాండ్ పవర్ గేమ్ ప్రత్యర్థులకు పీడకల.

గత రెండు మధ్యప్రదేశ్ టీ20 లీగ్ ఎడిషన్లలో 14 ఇన్నింగ్స్‌ల్లో 194.64 స్ట్రైక్ రేట్‌తో 436 పరుగులు, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇటీవలి ఏళ్లలో ఎంతోమంది ఐపీఎల్ ప్రాస్పెక్ట్స్‌ను అందించిన మధ్యప్రదేశ్ నుంచి వస్తున్న తాజా పేరు ఇతనే.

5. సమంత్ జాఖర్ (హర్యానా) – సిక్స్‌ల వీరుడు..

22 ఏళ్ల భారీ విగ్రహుడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సమంత్ జాఖర్ పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. ముఖ్యంగా స్ట్రెయిట్ బౌండరీపై అతని షాట్లు చూడముచ్చటగా ఉంటాయి. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా బాదేయగలడు.

ఎక్కువమంది చదివినది: IND vs NZ 5th ODI: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హమ్మయ్య చివరి వన్డే ఇక మనదే.. ఆ దరిద్రం పోయిందిగా..!

గత SMAT సీజన్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 178.37 స్ట్రైక్ రేట్‌తో 198 పరుగులు చేశాడు. అందులో ఏకంగా 20 సిక్సర్లు ఉన్నాయి. భారత ఫినిషర్ల కోసం వెతికే జట్లకు జాఖర్ విలువైన పెట్టుబడి కావచ్చు. ఈసారి నాణ్యమైన బౌలింగ్‌పై అతని సామర్థ్యానికి పరీక్ష.

SMAT చరిత్ర చూస్తే ఒక్క సీజన్ చాలు, అజ్ఞాత ఆటగాడు స్టార్ కావడానికి. పైన పేర్కొన్న ఐదుగురే కాదు, ఇంకా ఎంతోమంది క్యూలో ఉన్నారు. డిసెంబర్ 17 వేలం నాటికి ఎవరి ధర ఎంత పలుకుతుందో SMAT 2026నే తేల్చనుంది.

మరిన్ని క్రీడ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశా.. ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయా..
ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశా.. ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయా..
ఫుడ్ బిజినెస్‌లో దంపతుల అదృష్టం.. 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం!
ఫుడ్ బిజినెస్‌లో దంపతుల అదృష్టం.. 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం!
వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!
వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!
గ్యాంగ్రీన్ ఎలా ముప్పుగా మారుతుంది?
గ్యాంగ్రీన్ ఎలా ముప్పుగా మారుతుంది?
యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!
యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
అందని పూలు దేవుని కర్పణం..సామెత అసలు అర్థం తెలుసా?
అందని పూలు దేవుని కర్పణం..సామెత అసలు అర్థం తెలుసా?
జాగ్రత్తపడకపోతే మీ రిటైర్మెంట్ నగదు అంతా దోచేస్తారు జాగ్రత్త..
జాగ్రత్తపడకపోతే మీ రిటైర్మెంట్ నగదు అంతా దోచేస్తారు జాగ్రత్త..
15 బంతుల్లో స్కై విధ్వంసం.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్..?
15 బంతుల్లో స్కై విధ్వంసం.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్..?
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో