AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold ETFs 2026: గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి భారీగా పెట్టుబడులు.. ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే?

Gold ETFs in 2026: బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి భారీగా నిధులు తరలివస్తున్నాయి. 2026లో కేవలం పది నెలల్లోనే ఈ ఫండ్స్‌లో పెట్టుబడులు రూ.49 వేల కోట్ల మార్కును దాటాయి. గత ఏడాది పూర్తి స్థాయి పెట్టుబడులను కూడా అధిగమించాయి. ఇంత భారీగా పెట్టుబడులు రావడానికి కారణాలేంటి?

Gold ETFs 2026: గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి భారీగా పెట్టుబడులు.. ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే?
Gold ETFs 2026
Janardhan Veluru
|

Updated on: Nov 14, 2026 | 1:07 PM

Share

Gold ETFs Investment 2026: బంగారంపై భారతీయుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పసిడి ఆభరణాలు, నాణేలు కొనుగోలు చేయడమే కాకుండా, ఇప్పుడు డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs) వైపు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. 2026లో కేవలం పది నెలల్లోనే (జనవరి నుంచి అక్టోబర్) వరకు ఈ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు గత ఏడాది మొత్తంలో వచ్చిన పెట్టుబడులను మించిపోయాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) గణాంకాల ప్రకారం.. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి నికర పెట్టుబడులు సుమారు రూ.49,399 కోట్లకు చేరుకున్నాయి. 2025 పూర్తి సంవత్సరంలో ఈ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.42,961 కోట్లు మాత్రమే. అంటే 2025 మొత్తం పెట్టుబడులతో పోలిస్తే, ఈ ఏడాది మొదటి పది నెలల్లోనే అదనంగా రూ.6,438 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది దాదాపు 15 శాతం అధికం. ఇంకా 2026లో రెండు నెలలు మిగిలి ఉండగానే ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం విశేషం.

జనవరిలోనే భారీగా పెట్టుబడులు

2026లో గోల్డ్ ఈటీఎఫ్‌లకు జనవరి నెల అత్యంత కీలకంగా నిలిచింది. ఒక్క జనవరి నెలలోనే సుమారు రూ.24,040 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకు వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో దాదాపు 49 శాతం వాటా జనవరిదే కావడం విశేషం. ఫిబ్రవరిలో రూ.5,255 కోట్ల పెట్టుబడులు రాగా, సెప్టెంబర్‌లో రూ.4,451 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పది నెలల కాలంలో మే నెలలో మాత్రమే గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి నికరంగా పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.

మొత్తంగా గోల్డ్ ఈటీఎఫ్స్‌లో పెట్టుబడులు భారీగా పెరిగినప్పటికీ అక్టోబర్‌లో మాత్రం ఇన్‌ఫ్లోస్ కొంత తగ్గాయి. సెప్టెంబర్‌లో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే అక్టోబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గింది. బంగారం ధరలు గతంలో బాగా పెరగడంతో కొందరు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం దీనికి ఒక కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెట్టుబడుల వేగం తగ్గినప్పటికీ గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఆసక్తి కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

బంగారంపై పెట్టుబడులు ఎందుకు పెరుగుతున్నాయి?

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు, ద్రవ్య విధానాలపై అనిశ్చితి వంటి అంశాలు బంగారంపై పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. సాధారణంగా మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వివిధ మార్గాల్లో డైవర్సిఫై చేయాలని చూస్తారు. ఈ క్రమంలో బంగారాన్ని ఒక సేఫ్ పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. Morningstar Investment Research India సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ అభిప్రాయం ప్రకారం.. పెట్టుబడిదారులు తమ దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియోలో బంగారానికి ప్రాధాన్యం ఇవ్వడం పెరుగుతోంది.

సిల్వర్ ఈటీఎఫ్‌లలోనూ పెరిగిన పెట్టుబడులు

బంగారంతో పాటు వెండిపై కూడా ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోంది. అక్టోబర్ నెలలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు కలిపి రూ.6,566 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇందులో సిల్వర్ ఈటీఎఫ్‌ల వాటా రూ.3,092 కోట్లు. అంటే విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా?

గోల్డ్ ఈటీఎఫ్‌లు అంటే భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేసి ఇంట్లో దాచుకోవాల్సిన అవసరం లేకుండా, స్టాక్ మార్కెట్ ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టే విధానం. ఇవి దేశీయ బంగారం ధరలను అనుసరిస్తాయి. డీమ్యాట్ ఖాతా ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. అయితే గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని బంగారం ధరలు భవిష్యత్తులోనూ తప్పకుండా పెరుగుతాయని భావించకూడదు. బంగారం ధరల్లో మార్పులు, మార్కెట్ ఒడిదుడుకులు ఈ ఫండ్స్ రాబడులపై ప్రభావం చూపుతాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు రిస్క్, పెట్టుబడి లక్ష్యాలు, కాలపరిమితిని పరిశీలించడం అవసరం.

Follow Us
గోల్డ్ ETFsలోకి పెట్టుబడుల వరద.. ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే?
గోల్డ్ ETFsలోకి పెట్టుబడుల వరద.. ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే?
ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశా.. ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయా..
ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశా.. ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోయా..
ఫుడ్ బిజినెస్‌లో దంపతుల అదృష్టం.. 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం!
ఫుడ్ బిజినెస్‌లో దంపతుల అదృష్టం.. 9 నెలల్లోనే రూ.56 లక్షల ఆదాయం!
వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!
వచ్చేస్తున్నార్రోయ్.. బుడ్డోడిని మించిన 5గురు దేశీయ తోపులు..!
గ్యాంగ్రీన్ ఎలా ముప్పుగా మారుతుంది?
గ్యాంగ్రీన్ ఎలా ముప్పుగా మారుతుంది?
యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!
యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
అందని పూలు దేవుని కర్పణం..సామెత అసలు అర్థం తెలుసా?
అందని పూలు దేవుని కర్పణం..సామెత అసలు అర్థం తెలుసా?
జాగ్రత్తపడకపోతే మీ రిటైర్మెంట్ నగదు అంతా దోచేస్తారు జాగ్రత్త..
జాగ్రత్తపడకపోతే మీ రిటైర్మెంట్ నగదు అంతా దోచేస్తారు జాగ్రత్త..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో