కరోనా టెర్రర్: అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రాలివే.. తెలంగాణ కూడా!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినా రోజు రోజుకీ కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో కరోనా విజృంభణపై తాజాగా ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెంట్ శాస్త్రవేత్తల బృందం..

కరోనా టెర్రర్: అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రాలివే.. తెలంగాణ కూడా!
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 6:25 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినా రోజు రోజుకీ కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో కరోనా విజృంభణపై తాజాగా ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెంట్ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది. ఈ స్టడీలో ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. దేశంలో ప్రమాదకర రాష్ట్రాల జాబితాను మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రకటించింది. మధ్య ప్రదేశ్, బీహార్, తెలంగాణలోని అధిక జిల్లాలు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా తొమ్మిది పెద్ద రాష్ట్రాల్లోని అనేక జిల్లాలు కూడా ఇదే దశలో ఉన్నట్టు తెలిపింది.

ది లాన్సెట్ జర్నల్‌లోని అధ్యయనం ప్రకారం.. కరోనా మహమ్మారికి ఎక్కువగా ప్రభావితమయ్యే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, బీహార్, తెలంగాణ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఈ రాష్ట్రాల జిల్లాలోని హౌసింగ్, పరిశుభ్రత, ఆరోగ్య వ్యవస్థ లాంటి అనేక ముఖ్య సూచికలను పరిగణలోకి తీసుకొని ఈ అంచనాలకు వచ్చినట్టు పేర్కొంది అధ్యయన బృందం. ఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్‌కు చెందిన రాజీబ్ ఆచార్యతో సహా ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ మూడు రాష్ట్రాల తర్వాత.. జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మహా రాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్‌లకు కోవిడ్ కారణంగా అధికంగా ప్రభావితం కానున్నాయని వివరించింది అధ్యయన బృందం.

తమ అధ్యయనంలో భాగంగా వైరస్ వ్యాప్తి, కేసుల సంఖ్య, మరణాలు, సామాజిక, ఆర్థిక ప్రభావాలతో సహా సంక్రమణ పరిణామాలను పరిశీలించినట్టు తెలిపింది. ఈ జాబితాలో అతి తక్కువ ప్రభావం గల రాష్ట్రంగా సిక్కిం నలిచిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా రిస్క్ తగ్గించే వ్యూహాలను అవలంభించడంలో తమ అధ్యయనం తోడ్పడుతుందని అధ్యయన వేత్తలు వెల్లడించారు.

Read More: 

కృష్ణా జిల్లాకు ‘ఎన్టీఆర్’ పేరు? ఏపీ మంత్రి ఏం చెప్పారంటే!

బ్రేకింగ్: ‘తెలంగాణ సచివాలయం’ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్