క‌రోనా బాధితుల కోసం ఏపీకి చేరిన ప్ర‌త్యేక బోగీలు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నర్సాపురం స్టేషన్ కు పది కోచ్ లతో కూడిన ప్రత్యేక‌ రైలు ను కేటాయించింది.

క‌రోనా బాధితుల కోసం ఏపీకి చేరిన ప్ర‌త్యేక బోగీలు
Follow us

|

Updated on: Apr 10, 2020 | 3:48 PM

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నర్సాపురం స్టేషన్ కు పది కోచ్ లతో కూడిన ప్రత్యేక‌ రైలు ను కేటాయించింది. ఈ మేరకు స్థానిక రైల్వే స్టేషన్‌లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్టేషన్ లోని కోచ్ కేర్ డిపో ఆధ్వర్యం లో పది బోగి లలో 100బెడ్స్ ఏర్పాటు కు ముమ్మర చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇప్పటికీ ఆరు బోగిలలో పనులు పూర్తి కాగా, రేపటికి మొత్తం పది బోగీలు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
ప‌ది కోచ్ లలో ఎనిమిది జనరల్ కోచ్ లు, రెండు స్వీపర్ కోచ్ లు ఉన్నాయి. కరోనా బాధితుల సేవల కోసం , సామాజిక సేవలో భాగంగా ప్రత్యేక బోగీలను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలను చేపట్టింది. ఈ బోగిల‌లో పెషేంట్ల‌కు అవ‌స‌ర‌మైన‌ ఆక్షిజన్ తో బాటు వైద్య పరీక్షలు కు సంబంధించి కిట్స్‌ని కూడా అందుబాటులో ఉంచారు. అలాగే వైద్య సిబ్బంది కి బోగి లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. కరోనా కేసులకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా బోగి లను సిద్దం చేస్తున్నారు.
సౌత్ జోన్ పరిధిలోని నర్సాపురం, మచిలీపట్నం,కాకినాడ, విజయవాడ స్టేషన్ లకు 50 కోచ్ లను పంపినట్లు సౌత్‌సెంట్ర‌ల్ రైల్వే ప్ర‌క‌టించింది. కేసుల‌ సంఖ్య ఎక్కువ‌గా ఉండి, చికిత్సకు గదులు లేనప్పుడు బోగీల ను వినియోగించుకునే విధంగా ముందు జాగ్రత్త చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. వైర‌స్ బాధితులు ఎటువంటి అపోహ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని, ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని సూచిస్తున్నారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని తెలిపారు. రైల్వే క‌ల్పిస్తున్న ఈ అవకాశాన్ని స్థానిక వైద్య సిబ్బంది , ప్రజా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.