షాకింగ్.. కరోనాతో దేశంలో బయో ఉగ్రవాదానికి కుట్ర..?

షాకింగ్.. కరోనాతో దేశంలో బయో ఉగ్రవాదానికి కుట్ర..?

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తోంటే.. పాకిస్థాన్‌ మాత్రం తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. మనదేశంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నుతోంది. ఇప్పటి వరకు గత పది రోజులుగా దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలకు భారత సైన్యం చెక్ పెట్టింది. ఈ క్రమంలో మరో కుట్రకు పూనుకున్నారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో ఫైట్‌ చేస్తుండగా.. ఇప్పుడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. ఆ కరోనా మహమ్మారిని అంటించుకుని.. దేశంలో బయో ఉగ్రవాదానికి తెరలేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 10, 2020 | 5:44 PM

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తోంటే.. పాకిస్థాన్‌ మాత్రం తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. మనదేశంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నుతోంది. ఇప్పటి వరకు గత పది రోజులుగా దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలకు భారత సైన్యం చెక్ పెట్టింది. ఈ క్రమంలో మరో కుట్రకు పూనుకున్నారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో ఫైట్‌ చేస్తుండగా.. ఇప్పుడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. ఆ కరోనా మహమ్మారిని అంటించుకుని.. దేశంలో బయో ఉగ్రవాదానికి తెరలేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీహార్ పోలీసులు వీరి కుట్రను భగ్నం చేశారు. నేపాల్ సరిహద్దుల ద్వారా.. కరోనా పాజిటివ్ ఉన్న ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి.. తద్వారా కరోనా వ్యాప్తిని విస్తరింపజేయాలని పాకిస్థాన్‌ ఈ బయో కుట్రలకు తెరలేపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు సశస్త్ర సీమా బల్ (SSB) తమ ఉన్నతాధికారులకు రాసిన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. నేపాల్ మీదుగా.. దేశంలోకి ఉగ్రవాదులను పంపారని.. వారంతా గత నెలలో జరిగిన మత ప్రార్థనలో పాల్గొని ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇటీవల బీహార్‌లో గణనీయంగా కరోనా పాజిటివ్ కేసులు నమొదవ్వడాన్ని కూడా పేర్కొంది. పాకిస్థాన్ ఈ బయో ఉగ్రవాదానికి ఏమైనా తెరలేపి ఉండొచ్చన్న అనుమానాలకు కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu