AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై 36 నిమిషాల్లోనే కరోనా ఫలితం.!

కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ప్రస్తుతం విస్తృతంగా వినియోగిస్తున్న ఆర్‌టీ-పీసీఆర్ పద్దతిలో ఫలితం వెలువడేందుకు ఆలస్యం అవుతోంది.

ఇకపై 36 నిమిషాల్లోనే కరోనా ఫలితం.!
Ravi Kiran
|

Updated on: Jul 29, 2020 | 5:25 PM

Share

New Coronavirus Testing Results In 36 Minutes: కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ప్రస్తుతం విస్తృతంగా వినియోగిస్తున్న ఆర్‌టీ-పీసీఆర్ పద్దతిలో ఫలితం వెలువడేందుకు ఆలస్యం అవుతోంది. అంతేకాకుండా అనుమానితుడి రక్త నమూనాలో వైరల్ ఆర్ఎన్ఏ ఉందా.? లేదా.? అనేది గుర్తించేందుకు వివిధ రసాయనాలు అవసరమవుతున్నాయి. దీనితో ఫలితం రావడానికి సమయం పడుతోంది.

అందుకే ఇక మీదట అలాంటివి వాటి అవసరం లేకుండా ఉండేలా.. కరోనా పరీక్షను 36 నిమిషాల్లోనే పూర్తి చేయగలిగిన సరికొత్త నిర్ధారణ పద్దతిని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీకి చెందిన లీకాంగ్ చియాన్ స్కూల్ అఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ అద్భుతమైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరీక్షల కంటే ఇది నాలుగు రెట్లు వేగవంతమైందని వెల్లడించారు. డైరెక్ట్ పీసీఆర్ పద్దతి ప్రాతిపదికగా పని చేసే ఈ ప్రక్రియలో నేరుగా అనుమానితుడి రక్త నమూనాలను పరీక్షించి ఫలితం ఇస్తారు. దీనితో కోవిడ్ పరీక్షకు అయ్యే ఖర్చు, సమయం రెండూ కూడా గణనీయంగా తగ్గుతుంది. కాగా, ఈ పరీక్ష కిట్‌ను ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు తరలించే వీలు కూడా ఉంటుంది.

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ రెండు జిల్లాల్లో బ్యాంకుల వేళల్లో మార్పులు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్లు