స్నేహితుడా నువ్వు త్వ‌ర‌గా కోలుకుని ఇంటికి రావాలిః మోహ‌న్ బాబు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంతో త్వరగా ఇంటికి రావాలి పేర్కొన్నారు ప్ర‌ముఖ న‌టుడు మంచు మోహన్ బాబు. స్నేహితుడా, ఆత్మీయుడా.. నువ్వు ఆయురారోగ్యాలతో అతి తొందరలో ఇంటికి రావాలి. తొందరలో మన ఇన్‌స్టిట్యూష‌న్స్‌కి వచ్చి..

  • Tv9 Telugu
  • Publish Date - 3:50 pm, Mon, 17 August 20
స్నేహితుడా నువ్వు త్వ‌ర‌గా కోలుకుని ఇంటికి రావాలిః మోహ‌న్ బాబు

క‌రోనా వైర‌స్ సోక‌డం వ‌ల్ల గ‌త కొద్ది రోజులుగా ఆస్ప‌త్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు ప్ర‌ముఖ సీనియ‌ర్ సింగ‌ర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. అయితే మ‌ధ్య‌లో ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా ఉందంటూ ప‌లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆయ‌న కుమారుడు చ‌ర‌ణ్ క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం నాన్న కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక ఆయ‌న హెల్త్ కండీష‌న్‌కి సంబంధించి రోజూ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తున్నారు ఆస్ప‌త్రి సిబ్బంది. అలాగే ఎస్పీబీ చికిత్స తీసుకుంటున్న ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఆయన ఆరోగ్యం ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు.

తాజాగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంతో త్వరగా ఇంటికి రావాలి పేర్కొన్నారు ప్ర‌ముఖ న‌టుడు మంచు మోహన్ బాబు. స్నేహితుడా, ఆత్మీయుడా.. నువ్వు ఆయురారోగ్యాలతో అతి తొందరలో ఇంటికి రావాలి. తొందరలో మన ఇన్‌స్టిట్యూష‌న్స్‌కి వచ్చి అద్భుతంగా మంచి పాటలు పాడాలని, సినిమాల్లో పాటలు పాడాలని ఆ షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశ్శీసులు నీకు ఎప్పుడు ఉన్నాయి అంటూ బాలసుబ్ర‌మ‌ణ్యం గురించి మాట్ల‌డారు మోహ‌న్ బాబు.

Read More:

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం