కరోనాపై పోరుకు విరాళాలు.. ఏపీకి ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..!

కరోనాపై పోరుకు విరాళాలు.. ఏపీకి ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..!

కరోనాపై ప్రభుత్వాలు చేస్తోన్న పోరుకు పలువురు ఆర్థిక సాయం ప్రకటిస్తోన్న విషయం తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా తమకు తోచినంత సహాయం చేస్తున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 08, 2020 | 11:32 AM

కరోనాపై ప్రభుత్వాలు చేస్తోన్న పోరుకు పలువురు ఆర్థిక సాయం ప్రకటిస్తోన్న విషయం తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా తమకు తోచినంత సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాటికి ఏపీ ప్రభుత్వానికి 10,900 మంది విరాళాలు ఇచ్చారు. వీరి ద్వారా ఏపీ సీఎం సహాయనిధికి ఇప్పటివరకు రూ.122కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రజా సంబంధాల కమిషనర్ టి. విజయ కుమార్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 7వ తేది వరకు సీఎం సహాయనిధికి రూ.122,53,46,985కోట్లు అందినట్లు విజయ కుమార్ రెడ్డి వెల్లడించారు.

వారిలో ఏడు కంపెనీలు రూ.5కోట్లు, అంతకు పైగా విరాళాలు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. అందులో ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు, భారతీ సిమెంట్ కార్పోరేషన్‌ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్, అరబిందో ఫార్మా ఫౌండేషన్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటడ్, దివీస్‌ లాబోరేటరీస్‌ లిమిటెడ్, ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్ ఉన్నట్లు తెలిపారు. అలాగే 104మంది రూ.లక్ష, అంతకు పైగా విరాళాలు ఇచ్చినట్లు విజయ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇక సీఎం సహాయనిధికి విరాళాలు ఇవ్వాలనుకునే వారు చెక్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బును క్రెడిట్ చేయొచ్చని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విరాళాలు అందజేయాలనుకున్న వారి కోసం బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేశారు. విరాళాలకు ఎస్బీఐ అకౌంట్ నంబర్: 38588079208, వెలగపూడి సెక్రటేరియట్ బ్రాంచ్‌, IFSC Code: SBIN0018884 లేదా ఆంధ్రా బ్యాంక్‌ ఖాతా నంబర్‌: 110310100029039, వెలగపూడి సెక్రటేరియట్ బ్రాంచ్‌, IFSC Code: ANDB0003079లకు పంపొచ్చు. ఇక వెబ్ సైట్ ద్వారా విరాళాలు పంపాలనుకున్న దాతలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా apcmrf.ap.gov.in ద్వారా పంపొచ్చని తెలిపింది. దాతలు తమ పూర్తి చిరునామా, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, విరాళాల ఉద్దేశం, చెక్కులు లేదా ఆన్ లైన్ చెల్లింపు వివరాలను ప్రత్యేకాధికారి, ముఖ్యమంత్రి కార్యాలయం, మొదటి బ్లాక్, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి. గుంటూరు పేరిట పంపాలని సూచించారు. వీరు ముఖ్యమంత్రి లేఖ, రశీదు, వంద శాతం ఆదాయ పన్ను మినహాయింపు ధ్రువ పత్రం వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చని విజయ కుమార్ రెడ్డి తెలియజేశారు.

Read This Story Also: చిరు ఆఫర్‌ను తిరస్కరించిన డైరెక్టర్..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu