Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కేసులు, 467 మంది మృతి. దేశవ్యాప్తంగా7,19,665 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టీవ్ కేసులు4,39,948 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • భారత్ బయోటెక్ ICMR సంయుక్తంగా నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ నిమ్స్ లో ప్రారంభం. ఇవ్వాళ ఆరోగ్య వతమైన వ్యక్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. క్లినికల్ ట్రైల్స్ లో భాగం కానున్న 60 మంది. ఆరోగ్యంగా ఉండి క్లినికల్ ట్రయల్ కి సమ్మతించిన వారి రక్తనమూనాలను సేకరించి వివిధ రకాల వైద్య పరీక్షలు చేయనున్న నిమ్స్ ఆస్పత్రి.
  • పాత సచివాలయం కూల్చివేత కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత ను ప్రారంభించిన ప్రభుత్వం. నిన్న అర్ధరాత్రి నుంచి పాత సచివాలయం లోని భవనాలను కూల్చివేస్తున్న అధికారులు. సచివాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు. పాత సచివాలయానికి వెళ్లే రోడ్లున్నీ మూసివేసిన పోలీసులు. పాత సచివాలయం కిలోమీటర్ వరకు మోహరించిన పోలీసులు. ఇప్పటికే సచివాలయంలోని మధ్య లో ఉన్న కొన్ని భవనాలను నేలమట్టం చేసిన అధికారులు.
  • రెపటినుండి నిమ్స్ లో ప్రారంభం కానున్న క్లినికల్ ట్రైల్స్. ఏర్పాట్లను పూర్తి చేసిన నిమ్స్ యాజమాన్యం. ఎథిక్స్ కమిటీ అద్వర్యం లో జరగనున్న క్లినికల్ ట్రైల్స్.
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య అత్మహత్య కేసులో నింధితుల అరెస్ట్ . శంషాబాద్ సిఎస్ కె విల్లాస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని లావణ్య లహరి అత్మహత్య కేసులో నింధితులు మామ సుబ్బారావు ,అత్త రమాదేవి ,అడపడుచులు కృష్ణవేణి లక్ష్మీ కుమారిపై కేసు పమోదు . ప్రకాశం జిల్లా పిసిపల్లి మండలం లో అదుపులోకి తీసుకున్న పోలీసులు . నిందితులను హైదరాబాద్ కు తరలింపు.
  • పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్ రోడ్డు పై ప్రమాదం. అవుటర్ రింగ్ రోడ్డు పై ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా. హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మృతి మరో ముగ్గురు కానిస్టేబుల్లకి గాయాలు. ఏ పి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అవ్వడం తో పల్టీ కొట్టిన బొలెరో వాహనం. ప్రమాదం లో గాయపడ్డ వారిని హయత్ నగర్ లోని హాస్పిటల్ కి తరలింపు. గచ్చిబౌలి నుండి విజయవాడకి వెళ్తుండగా ఘటన.

చిరు ఆఫర్‌ను తిరస్కరించిన డైరెక్టర్..!

Chiranjeevi unhappy with director, చిరు ఆఫర్‌ను తిరస్కరించిన డైరెక్టర్..!

మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ఇచ్చిన ఆఫర్‌ను ఓ దర్శకుడు సున్నితంగా తిరస్కరించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. మెగాస్టార్ ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీకి వచ్చానని చెప్తూ వచ్చిన సదరు దర్శకుడు.. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆఫర్‌కు నో చెప్పడం టాలీవుడ్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరంటే మారుతి.

Chiranjeevi unhappy with director, చిరు ఆఫర్‌ను తిరస్కరించిన డైరెక్టర్..!

తన ఫ్యామిలీలోని యంగ్ హీరోల కెరీర్‌ను మెగాస్టార్‌ చూసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో చరణ్‌, సాయి ధరమ్ తేజ్‌లకు చిరు ఇచ్చిన ఇన్‌పుట్‌లు వారికి మంచి విజయాలను ఇచ్చాయి. ఇక ఇప్పుడు తన చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కెరీర్‌పై దృష్టి పెట్టిన చిరంజీవి.. అతడికి ఎలాగైనా ఓ హిట్ పడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కల్యాణ్‌తో ఓ మూవీ చేయాల్సిందిగా మారుతీకి ఆఫర్ ఇచ్చారట చిరు. కానీ కారణాలు తెలీవు గానీ ఈ ఆఫర్‌ను మారుతీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో మారుతీపై చిరు కాస్త అసహంగా ఉన్నట్లు సమాచారం. కాగా గతేడాది సాయి ధరమ్‌ తేజ్‌తో మారుతి తెరకెక్కించిన ప్రతి రోజు పండగే మంచి విజయాన్ని సాధించింది.

Read This Story Also: AA20: ‘పుష్ఫ’గా బన్నీ.. బర్త్‌డే కానుక అదిరిపోయిందబ్బా..!

Related Tags