వారం పనిచేస్తే 14 రోజుల సెలవులు.. జగన్ సర్కార్ నిర్ణ‌యం.!

వారం పనిచేస్తే 14 రోజుల సెలవులు.. జగన్ సర్కార్ నిర్ణ‌యం.!

Coronavirus Updates:  ఏపీలో రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా కేసుల దృష్ట్యా జగన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సీఎం అధ్వర్యంలో భవిష్యత్తు ప్రణాళికలను అధికారులు సిద్దం చేశారు. ఈ నేపథ్యంలోనే వైద్య, ఆరోగ్య శాఖకు కావాల్సిన టెస్టింగ్ పరికరాలు, బెడ్లు, మందులు, సిబ్బందిని పెద్ద ఎత్తున సిద్దం చేస్తున్నారు. మరోవైపు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక […]

Ravi Kiran

|

Apr 08, 2020 | 1:12 PM

Coronavirus Updates:  ఏపీలో రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా కేసుల దృష్ట్యా జగన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సీఎం అధ్వర్యంలో భవిష్యత్తు ప్రణాళికలను అధికారులు సిద్దం చేశారు. ఈ నేపథ్యంలోనే వైద్య, ఆరోగ్య శాఖకు కావాల్సిన టెస్టింగ్ పరికరాలు, బెడ్లు, మందులు, సిబ్బందిని పెద్ద ఎత్తున సిద్దం చేస్తున్నారు. మరోవైపు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారు వారం రోజులు పని చేస్తే రెండు వారాల పాటు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందట.

ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4 కరోనా ఆసుపత్రులు ఉన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు 13 జిల్లాల్లోనూ 13 ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్స్‌ను గుర్తించింది. అటు రాష్ట్రస్థాయి ఆసుపత్రుల్లో 444 ఐసీయూ బెడ్లు, 1,680 నాన్‌ ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక 13 జిల్లాల కోవిడ్‌ ఆస్పత్రులలో 650 ఐసీయూ, 8950 నాన్‌ ఐసీయూ బెడ్లను ప్రభుత్వం సిద్ధం చేయనుంది.

మరోవైపు రాష్ట్ర స్థాయిలోని ఒక్కో ఆస్పత్రిలో 100కు పైగా ఐసీయూ కెపాసిటీ, స్పెషలిస్టు డాక్టర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం… ఇప్పటికే రాష్ట్రస్థాయి ఆస్పత్రుల కోసం  648 స్పెషలిస్ట్ డాక్టర్లు, 792 పీజీ డాక్టర్లు, 792 హౌస్ సర్జన్లు, 1152 నర్సింగ్ సిబ్బందిని సిద్ధం చేసింది. అటు జిల్లా కోవిడ్‌ ఆస్పత్రుల్లో 546 స్పెషలిస్ట్ డాక్టర్లు, 546 పీజీ డాక్టర్లు, 273 హౌస్ సర్జన్లు, 546 నర్సింగ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. అలాగే వైద్య సిబ్బందికి ఎన్‌ 95 మాస్క్‌లు, పీపీఈలు అందుబాటులో ఉంచింది.

For More News:

ఏపీలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..!

గతేడాది మార్చి బిల్లు కడితే చాలు.. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు..

కరోనా బాధితులకు ‘తలా’ భారీ విరాళం..

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్.. విశాఖలో టెన్షన్..

‘విక్రమ్‌వేద’ రీమేక్‌లో పవన్, రవితేజ.. ముహూర్తం ఫిక్స్..!

ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది – చిరంజీవి

దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

లాక్ డౌన్ ఎఫెక్ట్.. వీధి కుక్కల్లో వింత ప్రవర్తన.. రసాయనాలు తట్టుకోలేక మృతి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu