చాలా ఫ్రీ టైమ్ దొరికింది- రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh Spends Time with Family : అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్ తన ఫ్యూచర్ ప్లాన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. డేట్స్ విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ముందుగా ‘సౌత్ ఇండియా’ షూటింగ్‌లో పాల్గొనాలనేలా ప్లాన్ చేసుకున్నట్లుగా చెప్పారు. త్వరలో హైదరాబాద్ రావాలనుకుంటున్నట్లుగా చెప్పారు. కరోనా కారణంగా భయపడుతన్నవారికి రకుల్ ప్రీత్ సింగ్ ఓ సలహా కూడా ఇచ్చారు. కరోనా రక్కసిని ఎదుర్కోవాలంటే స్వీయ జాగ్రత్తలు పాటించడంతో పాటు భయానికి దూరంగా ఉండటం […]
Rakul Preet Singh Spends Time with Family : అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్ తన ఫ్యూచర్ ప్లాన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. డేట్స్ విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ముందుగా ‘సౌత్ ఇండియా’ షూటింగ్‌లో పాల్గొనాలనేలా ప్లాన్ చేసుకున్నట్లుగా చెప్పారు. త్వరలో హైదరాబాద్ రావాలనుకుంటున్నట్లుగా చెప్పారు.
కరోనా కారణంగా భయపడుతన్నవారికి రకుల్ ప్రీత్ సింగ్ ఓ సలహా కూడా ఇచ్చారు. కరోనా రక్కసిని ఎదుర్కోవాలంటే స్వీయ జాగ్రత్తలు పాటించడంతో పాటు భయానికి దూరంగా ఉండటం ముఖ్యమని అన్నారు. భయమే తన దృష్టిలో అన్నింటికంటే పెద్ద డిజిజ్ అని తెలిపారు.
లాక్‌డౌన్ సమయంలో ముంబయిలోనే ఉండిపోయిన చిన్నది.. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత ఇటీవలే తన స్వగ్రామం గురుగావ్‌కు చేరుకుంది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.
దాదాపు తొమ్మిదేళ్ల క్రితం జీవితంలో ఉన్నతమైన లక్ష్యాల్ని సాధించాలనే కలలతో అమ్మనాన్నల్ని, ఇంటిని వదిలి తన జర్నీని ప్రారంభించినట్లుగా చెప్పారు. ఎన్నో కష్టాల్ని, అడ్డంకులను దాటుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను. చాలా కాలం తర్వాత అమ్మనాన్నలతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతున్నాను. మళ్లీ బాల్యంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపిస్తోంది. నా వంట రుచి చూసి అమ్మనాన్నలు బాగుందని మెచ్చుకున్నారు. అంటూ పోస్ట్ చేశారు.