కరోనా ఎఫెక్ట్ : కేవలం 500 మందితోనే జగన్నాథ రథయాత్ర

పూరిలో జగన్నాథ యాత్ర చాలా సింపుల్ గా జరుగుతోంది. సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో.. జగన్నాథ యాత్ర ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ప్రస్తుతం జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేవలం 500 మందితో యాత్ర నిర్వహిస్తున్నారు. కొవిడ్-19 ఆంక్షల నేపథ్యంలో కేంద్రం, ఒడిస్సా ప్రభుత్వాల సమన్వయంతో రథయాత్ర నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు. పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని […]

  • Sanjay Kasula
  • Publish Date - 11:56 am, Tue, 23 June 20
కరోనా ఎఫెక్ట్ : కేవలం 500 మందితోనే జగన్నాథ రథయాత్ర

పూరిలో జగన్నాథ యాత్ర చాలా సింపుల్ గా జరుగుతోంది. సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో.. జగన్నాథ యాత్ర ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ప్రస్తుతం జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేవలం 500 మందితో యాత్ర నిర్వహిస్తున్నారు. కొవిడ్-19 ఆంక్షల నేపథ్యంలో కేంద్రం, ఒడిస్సా ప్రభుత్వాల సమన్వయంతో రథయాత్ర నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు. పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిపిన తరువాత యాత్రకు ఓకే లభించింది. దీంతో మంగళవారం ఉదయం యాత్ర ప్రారంభమైంది.

అయితే రథయాత్రలో పాల్గొనే అందరికీ ముందుగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ రిపోర్ట్ వచ్చినవారికి మాత్రమే రథయాత్రలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ రథయాత్రలో పాల్గొనాలని సూచించారు. ఇప్పటికే జగన్నాథ ఆలయం, రథయాత్ర మార్గం మొత్తం శానిటైజేషన్ చేశారు. కోవిడ్-19 టెస్టు చేయించుకున్న పూజారుల్లో ఒకరికి పాజిటివ్ అని తేలింది. దీంతో పాజిటివ్ వచ్చిన పూజారి రథయాత్రకు దూరంగా ఉన్నారు.