‘మా బస్సులు వెనక్కి’.. యూపీకి ప్రియాంక గాంధీ లేఖ
వలస కార్మికుల తరలింపునకు ఉద్దేశించిన బస్సుల విషయంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మధ్య రేగిన మంట ఇంకా రాజుకుంటూనే ఉంది. తమ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వెయ్యి బస్సులను యూపీలోకి అనుమతించాలని అందుకు ఈ సాయంత్రం నాలుగు గంటల వరకు గడువు ఇస్తున్నామని ప్రియాంక రాసిన లేఖపట్ల యూపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో తమ బస్సులను ‘ఉపసంహరించుకుంటున్నామని’ ఆమె ప్రకటించారు, ఈ బస్సులపై మీ బీజేపీ పార్టీ స్టిక్కర్లను అంటించుకోండి […]
వలస కార్మికుల తరలింపునకు ఉద్దేశించిన బస్సుల విషయంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మధ్య రేగిన మంట ఇంకా రాజుకుంటూనే ఉంది. తమ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వెయ్యి బస్సులను యూపీలోకి అనుమతించాలని అందుకు ఈ సాయంత్రం నాలుగు గంటల వరకు గడువు ఇస్తున్నామని ప్రియాంక రాసిన లేఖపట్ల యూపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో తమ బస్సులను ‘ఉపసంహరించుకుంటున్నామని’ ఆమె ప్రకటించారు, ఈ బస్సులపై మీ బీజేపీ పార్టీ స్టిక్కర్లను అంటించుకోండి అని, అయితే ముందు ఈ వలస కార్మికులకోసం ఈ బస్సులను మీ రాష్ట్రంలోకి అనుమతించాలని ఆమె కోరారు. అయితే ఇదంతా ఫ్రాడ్ అని, ఈ బస్సులకు ఆటోలు, టూ వీలర్ల రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇఛ్చారని, అందుకే మేం వీటిని అనుమతించడం లేదని యూపీ సర్కార్ స్పష్టం చేసింది. ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీకే చెందిన అదితి సింగ్ అనే ఎమ్మెల్యే తన సొంత పార్టీనే దుయ్యబట్టారు. ఈ వెయ్యి బస్సుల్లో సగం ఫేక్ అని, సుమారు మూడు వందల బస్సులు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని పేర్కొన్న ఆయన.. ఈ కరోనా విపత్కర సమయంలో ఇది క్రూరమైన జోక్ అని అభివర్ణించారు.