కరోనాతో పెద్దమ్మ తల్లి గుడిలో కొత్త ప్రయోగం… గొడుగులతో!
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అందులోనూ హైదరాబాద్ నగరంలో రోజు రోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే జూన్ వరకు దేవాలయంలో భక్తుల అనుమతిని..
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అందులోనూ హైదరాబాద్ నగరంలో రోజు రోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే జూన్ వరకు దేవాలయంలో భక్తుల అనుమతిని నిరాకరించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలతో దేవాలయాలు తెరుచుకున్నాక భక్తులను అనుమతిస్తున్నారు. మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్తూ సర్కిల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు.
ఈ నేపథ్యంలో కరోనాతో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు పెద్దమ్మ తల్లి గుడి ఆలయ నిర్వాహకులు. దర్శనం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా గొడుకు ఉండాలనే నిబంధనలను తీసుకొచ్చారు. ఆలయంలో లోపల అడుగు పెట్టిన భక్తులు తప్పనిసరిగా గొడుగు ఓపెన్ చేసుకుని ఉంచాలి. దర్శనం పూర్తి చేసుకుని బయటకు వెళ్లే వరకూ గొడుగు మూయకూడదు. భక్తులు భౌతిక దూరం పాటించని కారణంతో.. ఆలయ నిర్వహకులు ఈ రూల్‌ని తీసుకొచ్చారు.
Read More:
‘క్యాస్టింగ్ కౌచ్’పై నటి ప్రగతి సంచలన కామెంట్స్..
సీఎం జగన్‌కు చెన్నైవాసి అరుదైన కానుక.. బంగారు, వెండితో మసీదు!
‘ఆత్మ నిర్భర్ భారత్ లోగో’ తయారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!