AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 1న ప్యాసింజర్ రైళ్ల కూత.. గైడ్‌లైన్స్ విడుదల..

వచ్చే నెల 1 నుంచి ప్రారంభించే ప్యాసింజర్ రైళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను రైల్వేశాఖ విడుదల చేసింది. అంతేకాక దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడపనున్నట్లు తెలుపుతూ వాటి వివరాలను ప్రకటించింది. టికెట్ల బుకింగ్స్, వివిధ కేటగిరీల కింద కోటా, టిక్కెట్ల రాయితీలు, టికెట్ రద్దు చేసుకుంటే తిరిగి చెల్లించే రుసుము, ఆరోగ్యపరమైన టెస్టులు, ఆహార సదుపాయాలు , రైళ్లలో దుప్పట్లు మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలను జారీ చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్‌లో టికెట్ బుకింగ్ […]

జూన్ 1న ప్యాసింజర్ రైళ్ల కూత.. గైడ్‌లైన్స్ విడుదల..
Ravi Kiran
|

Updated on: May 21, 2020 | 12:07 AM

Share

వచ్చే నెల 1 నుంచి ప్రారంభించే ప్యాసింజర్ రైళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను రైల్వేశాఖ విడుదల చేసింది. అంతేకాక దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడపనున్నట్లు తెలుపుతూ వాటి వివరాలను ప్రకటించింది. టికెట్ల బుకింగ్స్, వివిధ కేటగిరీల కింద కోటా, టిక్కెట్ల రాయితీలు, టికెట్ రద్దు చేసుకుంటే తిరిగి చెల్లించే రుసుము, ఆరోగ్యపరమైన టెస్టులు, ఆహార సదుపాయాలు , రైళ్లలో దుప్పట్లు మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలను జారీ చేసింది.

ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్‌లో టికెట్ బుకింగ్ ప్రారంభం కానుండగా.. ప్రతీ ట్రైన్‌కు జనరల్ బోగీలు ఉండవని స్పష్టం చేసింది.  గతంలో ప్యాసింజర్ రైళ్లలో వసూలు చేసే ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తామని వెల్లడించింది. కేవలం రిజర్వేషన్ సౌకర్యం ఉన్నవారిని మాత్రమే ఈ రైళ్లలోకి అనుమతి ఇవ్వనుండగా.. పూర్తిగా రిజర్వేషన్ బోగీలతోనే రైళ్లన్నీ నడుస్తాయని రైల్వేశాఖ వెల్లడించింది. మరోవైపు రైల్వేస్టేషన్లలో టికెట్ బుకింగ్‌లు ఉండవంది. కేవలం 30 రోజులు ముందు మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉండగా.. కన్ఫార్మ్ టికెట్లు ఉన్నవారికి మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతిస్తారని తెలిపింది.

మరోవైపు స్టేషన్‌లో ప్రతీ ప్రయాణీకుడికి ఆరోగ్య పరీక్షలు నిర్తవహిస్ప్పతారని.. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారిని ప్రయాణానికి అనుమతించారని రైల్వేశాఖ స్పష్టం చేసింది. వికలాంగులకు నాలుగు కేటగిరీల కింద, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి 11 కేటగిరీల కింద టికెట్ల ధరలలో రాయితీ ఉండనుంది. ప్రయాణికులు తమ స్వస్థలాలకు చేరిన తర్వాత ఆయా రాష్ట్రాలు విధించే నిబంధనలు తప్పక పాటించాలి. ఇక రైళ్లలో ఎటువంటి దుప్పట్లు, బ్లాంకెట్లు సరఫరా చేయబడదని రైల్వే శాఖ వెల్లడించింది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లు కూడా జారీ చేయబడవని తెలిపింది. కాగా,  రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు ఖాళీ సీట్లు ఉన్నప్పటికీ టికెట్లు జారీ చేసే అధికారం టీసీలకు ఉండదని వెల్లడించింది.

Read More:

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!

10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి…

మందుబాబులకు గుడ్ న్యూస్.. స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..

కిమ్‌ను బీట్ చేసిన మోదీ.. ప్రపంచంలోనే మూడోస్థానం..

హైకోర్టు సంచలన తీర్పు.. మైనర్ అబార్షన్‌కు అనుమతి…

విరాట్‌కు తప్పని లంచం.. సంచలన నిజాలు చెప్పిన భారత కెప్టెన్

Flash News: ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్లు ప్రారంభం..