కరోనా మాటున పాకిస్తాన్ భారీ కుట్ర.. భారత సైన్యానికి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..

కరోనా వైరస్ మహామ్మరితో ప్రపంచదేశాలు గడగడలాడుతుంటే.. పాకిస్తాన్ మాత్రం ఎప్పటికప్పుడు తన వక్ర బుద్దిని చూపిస్తూనే ఉంది. ఛాన్స్ దొరికితే చాలు భారత్‌ సైన్యంపై దొంగచాటుగా దాడి చేస్తోంది. ఇలాంటి తరుణంలో పాక్ ఇంటలిజెన్స్ అధికారులు నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో పెద్ద కుట్ర చేయబోతున్నారని భారత రక్షణ వర్గాలకు సమాచారం అందింది. కోవిడ్ -19 నేపథ్యంలో ఒకరి లొకేషన్ డేటాను సేకరించి, దాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) […]

కరోనా మాటున పాకిస్తాన్ భారీ కుట్ర.. భారత సైన్యానికి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..
Follow us

|

Updated on: Apr 30, 2020 | 7:26 PM

కరోనా వైరస్ మహామ్మరితో ప్రపంచదేశాలు గడగడలాడుతుంటే.. పాకిస్తాన్ మాత్రం ఎప్పటికప్పుడు తన వక్ర బుద్దిని చూపిస్తూనే ఉంది. ఛాన్స్ దొరికితే చాలు భారత్‌ సైన్యంపై దొంగచాటుగా దాడి చేస్తోంది. ఇలాంటి తరుణంలో పాక్ ఇంటలిజెన్స్ అధికారులు నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో పెద్ద కుట్ర చేయబోతున్నారని భారత రక్షణ వర్గాలకు సమాచారం అందింది. కోవిడ్ -19 నేపథ్యంలో ఒకరి లొకేషన్ డేటాను సేకరించి, దాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) కోవిడ్ -19 పరీక్షల డేటాబేస్‌తో క్రాస్ రిఫరెన్స్ చేయడం కోసం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను కేంద్రం రూపొందించింది. దీని ద్వారా కరోనా సోకిన వ్యక్తి సమీపంలో ఉంటే వినియోగదారుని తేలిక తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంటి నకిలీ నకిలీ ‘ఆరోగ్య సేతు’ యాప్‌ని పాకిస్తాన్‌కు చెందిన ఇంటెల్ ఆపరేటర్స్ అభివృద్ధి చేసి యునైటెడ్ కింగ్‌డమ్‌(బ్రిటన్) నుంచి వాట్సాప్ ద్వారా కొంత మంది భారత ఆర్మీ సిబ్బంది వాట్సాప్ గ్రూపులకు పంపినట్లు సీనియర్ ఆర్మీ అధికారులు గుర్తించారు. అటు భారత సైన్యం పేరుతో కొన్ని సోషల్ మీడియా అకౌంట్లను కూడా వాడుతున్నారని భారత ఆర్మీ హెచ్చరించింది.

ఒకసారి హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత.. మనకు తెలియకుండానే సున్నితమైన సమాచారం మొత్తం వేరేవాళ్లకు చేరిపోతుందని రక్షణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటివి శత్రు దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని వారు తెలిపారు. కాగా, ఇప్పటికే ఈ విషయం ఆర్మీ మేజర్లకు తెలియడంతో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను గవర్నమెంట్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌ mygov.in నుంచి గానీ.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా, గతంలోనే ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో ప్రమాదం పొంచి ఉందని.. కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్స్ వద్దకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మీ ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read Also:

ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!

తెరపైకి మరో కొత్త పేరు.. కిమ్ వారసుడు ఆయనేనట.!

లాక్ డౌన్ బేఖాతర్.. గుంపులుగా సామూహిక ప్రార్ధనలు..

మే 3 తర్వాత లాక్ డౌన్ 3.0 ఖాయమేనా.?

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?