దేశంలో కరోనా @ 33 వేలు, మృతులు 1074…
భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1718 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. ఇక ఈ మహమ్మారి బారిన పడి 24 గంటల్లో 67 మంది మృతి చెందటంతో.. మొత్తంగా మృతుల సంఖ్య 1074కు […]

భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1718 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. ఇక ఈ మహమ్మారి బారిన పడి 24 గంటల్లో 67 మంది మృతి చెందటంతో.. మొత్తంగా మృతుల సంఖ్య 1074కు చేరింది. అటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 25.19గా పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటి వరకు 8,324 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Read Also:
ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!
తెరపైకి మరో కొత్త పేరు.. కిమ్ వారసుడు ఆయనేనట.!
దారుణం: ప్రేమించిన పాపానికి హత్య చేసి శవాన్ని ఇంట్లోనే పూడ్చేశాడు..
