దారుణం: ప్రేమించిన పాపానికి హత్య చేసి శవాన్ని ఇంట్లోనే పూడ్చేశాడు..
ప్రేమించిన పాపానికి ఓ నయ వంచకుడు ఒక మహిళను మోసగించడమే కాకుండా దారుణంగా చంపి తన ఇంట్లోనే పాతిపెట్టేసిన ఘటన కేరళలోని పాలక్కడ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొల్లాం జిల్లాకు చెందిన 42 ఏళ్ల సుచిత్ర కొట్టాయంలో ట్రైనీ బ్యుటిషియన్‌గా పని చేస్తోంది. మార్చి 17న తన మావయ్యకు ఆరోగ్యం బాగలేకపోవడంతో తనకు సెలవు కావాలంటూ కంపెనీకి ఓ మెయిల్ పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇక ఆ తర్వాత రోజు మరోసారి మెయిల్ చేసి తనకు […]

ప్రేమించిన పాపానికి ఓ నయ వంచకుడు ఒక మహిళను మోసగించడమే కాకుండా దారుణంగా చంపి తన ఇంట్లోనే పాతిపెట్టేసిన ఘటన కేరళలోని పాలక్కడ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొల్లాం జిల్లాకు చెందిన 42 ఏళ్ల సుచిత్ర కొట్టాయంలో ట్రైనీ బ్యుటిషియన్‌గా పని చేస్తోంది. మార్చి 17న తన మావయ్యకు ఆరోగ్యం బాగలేకపోవడంతో తనకు సెలవు కావాలంటూ కంపెనీకి ఓ మెయిల్ పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇక ఆ తర్వాత రోజు మరోసారి మెయిల్ చేసి తనకు ఇంకో ఐదు రోజులు సెలవు పొడిగించాలంటూ కోరింది. అటు ఇంట్లోవాళ్ళకు ట్రైనింగ్ పని మీద ఎర్నాకుళం పంపిస్తున్నారంటూ సుచిత్ర అబద్దం చెప్పి వెళ్ళింది.
ఐదు రోజులు గడుస్తున్నా సుచిత్ర నుంచి ఫోన్ రాకపోవడంతో అనుమానమొచ్చి ఆమె ఇంట్లో వాళ్లు ఆఫీస్‌కు ఫోన్ చేశారు. తన మామయ్యకు ఒంట్లో బాగోలేదని ఐదు రోజులు సెలవు పెట్టినట్లు సంస్థ అధికారులు పేర్కొన్నారు. దానితో వెంటనే కొట్టాయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కుటుంబసభ్యులు సుచిత్రపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కొద్దికాలం క్రితం సుచిత్ర తన భర్తతో విడిపోయిందని కూడా వెల్లడించారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
మనాలీకి కీబోర్డ్ ప్లేయర్ 32 ఏళ్ల ప్రశాంత్‌తో సుచిత్రకు పరిచయం ఏర్పడిందని.. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిందని దర్యాప్తులో తేలింది. ప్రశాంత్‌ను కలవడానికే సుచిత్ర మనాలీ వెళ్లిందని తేలడంతో కొల్లాయం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో సుచిత్రను హత్య చేసినట్లు ప్రశాంత్ ఒప్పుకున్నాడు. కొద్దిరోజులుగా పెళ్లి చేసుకోవాలంటూ ఆమె ఒత్తిడి చేసిందని.. అందుకే హత్య చేసి శవాన్ని తాను ఉంటున్న ఇంట్లోనే పూడ్చి పెట్టానని ఒప్పుకున్నాడు. కాగా, ప్రశాంత్ వివరాల ప్రకారం పోలీసులు ఆ చోటులో తవ్వగా ఓ కుళ్లిన శవం దొరికింది. ఫోరెన్సిక్ పరీక్షలు అనంతరం అది సుచిత్రదేనని నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ప్రశాంత్‌ను అరెస్టు చేసిన రిమైండ్‌కు తరలించారు.
Read Also:
ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!
విజయవాడలో హైటెన్షన్.. నలుగురు వార్డు వాలంటీర్లకు కరోనా..