హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తృతీయ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ హిందువులకు చాలా ప్రాముఖ్యమైన రోజు.
అక్షయ ...అంటే ఎప్పటికీ తగ్గనిది అని అర్థం వస్తుంది. దీన్ని హిందువుల జైనులు కూడా ఈ రోజును చాల పవిత్రమైనదిగా భావిస్తారు.
ఈ రోజున కొత్త వ్యాపారాలు మొదలుపెట్టిన, కొత్త వస్తువులు కొన్నా ఆర్థికంగా అభివృద్ది చెందుత్తరని పండితులు చెబుతున్నారు.
అక్షయ తృతీయ నాడు బంగారం లేదా వెండిని కొనడం ఆనవాయితీగా వస్తుంది. బంగారం సంపద, శ్రేయస్సును; వెండి స్వచ్ఛత, ఆశీర్వాదాలను సూచిస్తుంది.
అక్షయ తృతీయ రోజున కారు లేదా ద్విచక్ర వాహనం కొనడం కూడా మంచిదే. దీనివల్ల ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. ఈ రోజున కొన్ని కంపెనీలు డిస్కౌంట్లను కూడా ప్రకటిస్తాయి.
అక్షయ తృతీయ రోజు భూమిని కొనడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజుని ఏదైనా ఆస్తి కొంటె అభివృద్ది చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి.
అక్షయ తృతీయ రాగి, ఉక్కు పాత్రలు తీసుకోవడం వల్ల అదృష్టం వస్తుందని నమ్ముతారు. ఈ రోజున వంట సామాను, గృహోపయోగ వస్తువులు తీసుకోండి.
SIP ప్రారంభించడానికి కూడా అక్షయ తృతీయ శుభప్రదం. ఈ ఈరోజున పెట్టుబడులు పెడితే పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.