30 April 2025

ఫస్ట్ మూవీ డిజాస్టర్.. అయినా తగ్గని ఆఫర్స్.. ఏకంగా స్టార్ హీరోలతో..

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగుల ప్రపంచంలో కొందరు హీరోయిన్లకు అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఫస్ట్ సినిమా డిజాస్టర్ అయినా వరుస ఆఫర్స్ వస్తుంటాయి.

ఈ ముద్దుగుమ్మకు సైతం అలాగే వరుస అవకాశాలు వస్తున్నాయి. నిజానికి ఆమె నటించిన మొదటి సినిమా డిజాస్టర్ అయ్యింది.

అయినప్పటికీ తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తుంది. ప్రస్తుతం తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. 

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ భాగ్య శ్రీ భోర్సే. రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది. 

కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయినా ఇప్పుడు మాత్రం వరుస సినిమాలు చేస్తుంది. చేతినిండా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. 

విజయ్ దేవరకొండ సరసన కింగ్ డమ్ సినిమాలో నటిస్తుంది. షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ మే 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

ఆ తర్వాత రామ్ పోతినేనితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రానా, దుల్కర్ సల్మాన్ కలిసి నటిస్తున్న సినిమాలో ఎంపికైంది. 

కాంత పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో భాగ్య శ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుంది. అలాగే మరో తెలుగులోనూ భాగ్య శ్రీ నటించనున్నట్లు టాక్.