భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు?

30 April 2025

Prudvi Battula 

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటోంది.

భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దును అంతర్జాతీయ సరిహద్దు అని కూడా అంటారు. భారతదేశం వైపు నుండి సరిహద్దు భద్రతా దళం ఇక్కడ మోహరించి ఉంటుంది.

భారతదేశం - పాకిస్తాన్ మధ్య సరిహద్దు దాదాపు 3,323 కిలోమీటర్ల పొడవు అంటుందని చాల నివేదిక చెబుతున్నాయి.

భారతదేశంలోని అనేక రాష్ట్రాలు పాకిస్థాన్ సరిహద్దుతో అనుసంధానించి ఉన్నాయని దేశంలో అందరికి తెలిసిన విషయమే.

పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న రాష్ట్రాలు.

భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు చాలా పొడవుగా ఉండటం వలన అంతరిక్షం ద్వారా కూడా ఎప్పుడు భద్రతా నిఘా ఉంటుంది.

వాఘా-అట్టారి సరిహద్దు భారత్-పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు. దీన్ని క్లోజ్ చేసినట్టు భారత ప్రభుత్యం తెలిపింది.

భారతదేశంలోని ఇది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లా అట్టారి. పాకిస్తాన్‌లోని వాఘా పట్టణాలకు సమీపంలో ఉంది.