ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!

కరోనా కాలంలో దాయాది పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా తగ్గించేందుకు సన్నద్దమైంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పతనం కావడంతో పాకిస్తాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డీజిల్‌పై లీటర్‌కు రూ. 33.94 మేరకు.. అలాగే పెట్రోల్‌పై రూ. 20.68 తగ్గించనున్నట్లు పాకిస్తాన్ ఆయిల్ అండ్ రెగ్యులేటరీ అధారిటీ తెలిపింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌తో చర్చించిన అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం […]

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!
Follow us

|

Updated on: May 01, 2020 | 7:11 PM

కరోనా కాలంలో దాయాది పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా తగ్గించేందుకు సన్నద్దమైంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పతనం కావడంతో పాకిస్తాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డీజిల్‌పై లీటర్‌కు రూ. 33.94 మేరకు.. అలాగే పెట్రోల్‌పై రూ. 20.68 తగ్గించనున్నట్లు పాకిస్తాన్ ఆయిల్ అండ్ రెగ్యులేటరీ అధారిటీ తెలిపింది.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌తో చర్చించిన అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. కాగా, రేపటి నుంచి తగ్గిన ధరలు అమలులోకి రానున్నాయి. అంతేకాక కిరోసిన్ రేట్లు కూడా తగ్గించాలని పాక్ ప్రభుత్వం యోచిస్తోంది. దీని బట్టి చూస్తే కరోనా కాలంలో ప్రజలకు ఇది పెద్ద ఊరట అని చెప్పొచ్చు.

Read This: కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..