గోద్రాలో పోలీసులపై రాళ్ల దాడి.. 30 మంది అరెస్ట్..

గోద్రాలో పోలీసులపై రాళ్ల దాడి.. 30 మంది అరెస్ట్..

కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా రెడ్‌ జోన్‌ ఉన్న ప్రాంతాల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు  హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతూ.. విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అంతేకాదు కొందరు గుంపులు గుంపులుగా ఉంటూ.. ఏకంగా పోలీసులపైకే రాళ్లు విసురుతున్నారు. మొన్నటి వరకు కరోనా టెస్టుల కోసం వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడికి దిగగా.. తాజాగా కరోనా సోకకుండా ఇళ్లల్లో ఉండడంటూ హెచ్చరిస్తున్న పోలీసులపైకి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 01, 2020 | 7:04 PM

కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా రెడ్‌ జోన్‌ ఉన్న ప్రాంతాల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు  హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతూ.. విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అంతేకాదు కొందరు గుంపులు గుంపులుగా ఉంటూ.. ఏకంగా పోలీసులపైకే రాళ్లు విసురుతున్నారు. మొన్నటి వరకు కరోనా టెస్టుల కోసం వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడికి దిగగా.. తాజాగా కరోనా సోకకుండా ఇళ్లల్లో ఉండడంటూ హెచ్చరిస్తున్న పోలీసులపైకి కూడా దాడులు చేస్తున్నారు. మొన్న వెస్ట్ బెంగాల్ లోని హౌరాలో ఏకంగా పోలీసులపైకి మూకదాడి చేసిన ఘటన మర్చిపోకముందే.. తాజాగా గురువారం గుజరాత్‌లోని  గోద్రాలో పోలీసులపైకి రాళ్ల దాడికి దిగాయి అల్లరిమూకలు.

గోద్రా రెడ్‌ జోన్‌లో ఉండటంతో.. పలుచోట్ల కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. అయితే కంటైన్మెంట్‌ జోన్‌లో ఉన్నవారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న చేసిపెడతామని పోలీసులు చెప్తూనే ఉన్నారు. అయితే తాజాగా గోద్రాలోని పాంచ్‌మహల్ ప్రాంతంలో కంటైన్‌మెంట్ జోన్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేస్తుండగా పోలీసులతో, స్థానికులు ఘర్షణకు దిగారు. రాత్రి సమయంలో రోడ్ల పైనే ఉండటంతో పాటు.. గుంపులు గుంపులుగా ఉండటంతో.. పోలీసులు ఇళ్లలోకి వెళ్లాలంటూ సూచించారు. అయితే ఈ క్రమంలో కొందరు యువకులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటపడటంతో.. పోలీసులు రాళ్ల దాడికి పాల్పడిన ముప్పై మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. అంతేకాదు.. మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఉన్నారని.. వారిని కూడా త్వరలో పట్టుకుని అరెస్ట్ చేస్తామని పోలీలసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ లీలా పాటిల్ తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu