AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ తో కరోనా వైరస్ ని నియంత్రించలేం.. వైరాలజిస్ట్ జమీల్

దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించినప్పటికీ.. అది కరోనా వైరస్ ని అదుపు చేయడంలో తోడ్పడదని ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ తెలిపారు. లాక్ డౌన్ ఆంక్షల బదులు.

లాక్ డౌన్ తో కరోనా వైరస్ ని నియంత్రించలేం.. వైరాలజిస్ట్ జమీల్
Umakanth Rao
| Edited By: |

Updated on: May 24, 2020 | 3:33 PM

Share

దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించినప్పటికీ.. అది కరోనా వైరస్ ని అదుపు చేయడంలో తోడ్పడదని ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ తెలిపారు. లాక్ డౌన్ ఆంక్షల బదులు.. కమ్యూనిటీ కంటెయిన్మెంట్, ఐసోలేషన్, క్వారంటైన్ వంటి చర్యలు బెటరని ఆయన అన్నారు. సైన్స్, టెక్నాలజీ రంగానికి గాను శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు విజేత ఆయిన ఈయన.. కరోనా వైరస్ హాట్ స్పాట్ లను గుర్తించేందుకు ముమ్మరంగా టెస్టింగులు చేయాలన్నారు. ఆయా ప్రాంతాలను ఐసొలేట్ చేయాలని కూడా సూచించారు. ఇండియాలో ప్రతి పది లక్షల జనాభాకు 1744 టెస్టింగ్స్ చేస్తున్నారు.. ప్రపంచంలో ఇంత తక్కువ స్థాయిలో మరెక్కడా టెస్టింగ్స్ చేయడంలేదు అని ఆయన వెల్లడించారు. ఇవి చాలా వరకు పెరగాలని సూచించారు. యాంటీ బాడీ టెస్టులను, పీసీఆర్ టెస్టులను ఎక్కువగా నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జమీల్ అభిప్రాయపడ్డారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను నిరంతరం మానిటరింగ్ చేస్తుండాలని, ఆ డేటా ప్రకారం ఆయా ప్రాంతాల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో సామూహిక ట్రాన్స్ మిషన్ దశ ఏనాడో ప్రవేశించిందని ఆయన తెలిపారు. కానీ దీన్ని అంగీకరించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు రెడీగా లేరని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

శ్వాస కోశ సంబంధ సమస్యలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సొంతంగా జరిపిన అధ్యయనంలో.. ‘సార్స్ -కోవిడ్-2 ‘ పాజిటివ్ కి గురైన వారిలో 40 శాతం మంది ఎలాంటి విదేశీ ప్రయాణాలూ చేయలేదన్న విషయం స్పష్టమైందని షాహిద్ జమీల్ చెప్పారు.

Follow Us
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..