కరోనా నుంచి బయటపడి ప్లాస్మా దానం చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు
కరోనా నుంచి కోలుకున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కూడా ప్లాస్మాను దానం చేశారు. రాజస్థాన్‌లోని 126 బెటాలియన్‌కు చెందిన పలువురు బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. అయితే వీరిలో కొందరు కరోనా నుంచి..
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దాటికి సామాన్య ప్రజల నుంచి మొదలు.. రాజ్యాలకు చెందిన అధ్యక్షులు కూడా గజగజ వణికిపోతున్నారు. ఈ వైరస్‌కు ప్రాంతం, కులం, మతం, రంగు, భాష, పేద, ధనిక అన్న సమాజిక తేడా ఏం లేదు. అన్ని వర్గాలను ఈ వైరస్ టచ్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా కరోన మహమ్మారి సోకగా.. లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. అయితే దీనిక వ్యాక్సిన్ ఇంకా రాకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు కరోనా బారినపడి మరణిస్తున్నారు. వీరిని రక్షించేందుకు వైద్యులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశంలో వైద్యులు ప్లాస్మా థెరపీ చేసి.. కరోనాతో పోరాడుతున్న వారిని వైద్యులు రక్షిస్తున్నారు. ఈ థెరపీ చేయడంతో అనేక మంది తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలతో పోరాడుతున్న వారిని వైద్యులు రక్షించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు ఈ థెరపీ చేస్తున్నారు. ఇందుకోసం ప్లాస్మా సేకరించేందుకు పలు రాష్ట్రాలు ప్లాస్మా బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
తాజాగా.. కరోనా నుంచి కోలుకున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కూడా ప్లాస్మాను దానం చేశారు. రాజస్థాన్‌లోని 126 బెటాలియన్‌కు చెందిన పలువురు బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. అయితే వీరిలో కొందరు కరోనా నుంచి బయట పడి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ప్లాస్మాను దానం చేస్తే.. కరోనా బారినపడ్డ వారిని కొందరినైనా కాపాడవచ్చన సంగతి తెలిసిన జవాన్లు.. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వెంటనే జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ ఆస్పత్రిలో తొమ్మిది మంది బీఎస్ఎఫ్ జవాన్లు ప్లాస్మాను దానం చేశారు.