లాక్‌డౌన్‌తో జాబ్‌ పోయింది.. లక్కీగా రూ.46 కోట్ల లాటరీ తగిలింది..

అదృష్టలక్ష్మీ.. ఎప్పుడు? ఎలా? తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా  ఉద్యోగం పోయిన ఓ వ్యక్తికి లచ్చిందేవి ఏకంగా రూ. 46 కోట్ల లాటరీ రూపంలో నట్టింటికి వచ్చింది. దీనితో ఆ వ్యక్తి కుటుంబం ఆనందంతో పండుగ చేసుకున్నారు. ఈ ఊహించని పరిణామం న్యూజిలాండ్‌లో చోటు చేసుకోగా.. కరోనా కాలంలో ఇంతటి అదృష్టాన్ని కలిగిన ఆ వ్యక్తిని చూసి చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం లాక్ డౌన్ […]

  • Ravi Kiran
  • Publish Date - 4:04 pm, Thu, 21 May 20
లాక్‌డౌన్‌తో జాబ్‌ పోయింది.. లక్కీగా రూ.46 కోట్ల లాటరీ తగిలింది..

అదృష్టలక్ష్మీ.. ఎప్పుడు? ఎలా? తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా  ఉద్యోగం పోయిన ఓ వ్యక్తికి లచ్చిందేవి ఏకంగా రూ. 46 కోట్ల లాటరీ రూపంలో నట్టింటికి వచ్చింది. దీనితో ఆ వ్యక్తి కుటుంబం ఆనందంతో పండుగ చేసుకున్నారు. ఈ ఊహించని పరిణామం న్యూజిలాండ్‌లో చోటు చేసుకోగా.. కరోనా కాలంలో ఇంతటి అదృష్టాన్ని కలిగిన ఆ వ్యక్తిని చూసి చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం లాక్ డౌన్ సమయంలో సదురు వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడు. ఖాళీగా ఉంటుండటంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలోనే సైట్లో లాటరీ ఫలితాలు చూడగా.. అతని లాటరీ నెంబర్ కనిపించింది. ఏకంగా రూ. 46 కోట్లు(10.3 న్యూజిలాండ్ డాలర్స్) లాటరీ వచ్చినట్లు తేలింది. ఇదే విషయాన్ని మైలోటో అనే కస్టమర్ కేర్ కూడా వెల్లడించడంతో అతడి ఆనందానికి అవధులు లేవు. మధ్యతరగతి వ్యక్తి కావడంతో ఆ డబ్బు ఏయే పనులకు ఉపయోగించుకోవాలన్న దానిపై అప్పుడే ప్రణాళికలను కూడా సిద్ధం చేశాడు. ఏది ఏమైనా కరోనా టైంలో భారీ లాటరీ గెలుచుకున్నాడంటే.. నిజంగా యమా లక్కీనే..

Read This: తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయి.. బ్రేక్ చేస్తే బాదుడే.!