న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సూనామీకి ఛాన్స్..

New Zealand Earthquake : ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంటే మరోవైపు ప్రకృతి వైపరిత్యాలు మరింత భయపెడుతున్నాయి. తాజాగా.. న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత  7.1గా నమోదైందని సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. కెర్మాడెక్ దీవు దక్షిణ ప్రాంతంలో భూమి కంపించిందని పేర్కొంది. దీవిలో భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం ఉంది. ఈ భూ ప్రకంపనలతో న్యూజిలాండ్‌లోని ఒపొటికి, వాటాఖనే, గిస్బోర్న్, తౌరంగ, రొటొర్గాపై కూడా ఈ ప్రభావం […]

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సూనామీకి ఛాన్స్..
Follow us
Sanjay Kasula

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 8:48 PM

New Zealand Earthquake : ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంటే మరోవైపు ప్రకృతి వైపరిత్యాలు మరింత భయపెడుతున్నాయి. తాజాగా.. న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత  7.1గా నమోదైందని సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. కెర్మాడెక్ దీవు దక్షిణ ప్రాంతంలో భూమి కంపించిందని పేర్కొంది. దీవిలో భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం ఉంది.

ఈ భూ ప్రకంపనలతో న్యూజిలాండ్‌లోని ఒపొటికి, వాటాఖనే, గిస్బోర్న్, తౌరంగ, రొటొర్గాపై కూడా ఈ ప్రభావం కనించిందని ఓ మీడియా సంస్థ ప్రకటించింది. భూ ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండటంతో  ఆస్తి నష్టం భారీగా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. భూ ప్రకంపనలు అధికంగా ఉన్నప్పటకీ.. సునామీ వచ్చే అవకాశం లేదంటున్నారు అమెరికా జియలాజిస్టులు. కానీ అమెరికా జియలాజిస్టులు మాత్రం భూంకప తీవ్రత 7.4గా ఉంది అని రిపోర్ట్ చేశాయి.