AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేశవదాసుపాలెంలో మరోసారి గ్యాస్‌ లీకేజీ

ఇటీవల చోటుచేసుకున్న విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి గ్యాస్ లీకేజీ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో మరోసారి గ్యాస్ లీక్ అయ్యింది. ఓఎన్జీసీ బావి పైపులైన్‌ నుంచి వచ్చే సహజ వాయువు స్వల్పంగా లీకైంది. నివాసగృహాలకు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు వెంటనే ఓఎన్జీసీ, రెవెన్యూ, పోలీసు అధికారులకు […]

కేశవదాసుపాలెంలో మరోసారి గ్యాస్‌ లీకేజీ
Sanjay Kasula
|

Updated on: Jun 18, 2020 | 8:04 PM

Share

ఇటీవల చోటుచేసుకున్న విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి గ్యాస్ లీకేజీ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో మరోసారి గ్యాస్ లీక్ అయ్యింది. ఓఎన్జీసీ బావి పైపులైన్‌ నుంచి వచ్చే సహజ వాయువు స్వల్పంగా లీకైంది. నివాసగృహాలకు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.

స్థానికులు వెంటనే ఓఎన్జీసీ, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకుని బావి నుంచి గ్యాస్‌ ఉత్పత్తి కాకుండా నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత నెలలోనూ ఇదే ప్రాంతంలో రెండు సార్లు గ్యాసు లీకైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?