తమిళనాడులో ఒక్కరోజులో.. 2,141 కరోనా పాజిటివ్ కేసులు..
ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడులో ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం సాయంత్రం
ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడులో ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రానికి 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,141 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,334కు చేరింది. తమిళనాడు ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
మరోవైపు.. కరోనా మరణాల సంఖ్య తమిళనాడులో రోజురోజుకు పెరిగిపోతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 49 మంది మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 625కు చేరింది. కాగా, మొత్తం కేసులలో ఇప్పటివరకు 28,641 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 23,065 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: గురుకుల పాఠశాలల్లో.. లాటరీ పద్ధతిలో అడ్మిషన్లు..