బోల్తా పడ్డ జీపు.. ముగ్గురు మృతి.. ఇద్దరికి గాయాలు..

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతం నుంచి వెళ్తున్న ఓ జీపు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. కిన్నౌర్‌ జిల్లాలోని న్యుగల్సరీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సిమ్లాలోని రాంపూర్ ఆస్పత్రికి తరలించారు. జీపు నుంచి మృతదేహాలను వెలికి తీసి.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు. వాహనం […]

బోల్తా పడ్డ జీపు.. ముగ్గురు మృతి.. ఇద్దరికి గాయాలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 18, 2020 | 8:29 PM

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతం నుంచి వెళ్తున్న ఓ జీపు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. కిన్నౌర్‌ జిల్లాలోని న్యుగల్సరీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సిమ్లాలోని రాంపూర్ ఆస్పత్రికి తరలించారు. జీపు నుంచి మృతదేహాలను వెలికి తీసి.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు. వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.