అక్క‌డ 5 వేల మంది ఇండియన్స్‌కు కరోనా !

అగ్ర‌రాజ్యం అమెరికా స‌హా అన్ని దేశాలు క‌రోనా ధాటికి ఉక్కిరిబిక్కిర‌వుతున్నాయి. ఇక విదేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల ప‌రిస్థితి ద‌యానీయంగా మారింది. తాజాగా,..

అక్క‌డ 5 వేల మంది ఇండియన్స్‌కు కరోనా !
Follow us

|

Updated on: May 05, 2020 | 10:10 AM

ప్ర‌పంచ దేశాల్లో కోవిడ్ -19 మ‌హ‌మ్మారి విల‌య తాండ‌వం చేస్తోంది. అగ్ర‌రాజ్యం అమెరికా స‌హా అన్ని దేశాలు క‌రోనా ధాటికి ఉక్కిరిబిక్కిర‌వుతున్నాయి. ఇక విదేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల ప‌రిస్థితి ద‌యానీయంగా మారింది. తాజాగా, సింగ‌పూర్‌లో సుమారుగా 5,000 మంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డిన‌ట్లు స‌మాచారం.
సింగ‌పూర్‌లో క‌రోనా విజృంభ‌ణ కోన‌సాగుతోంది. విద్యార్థులతో సహా 3,500మందికి పైగా అక్క‌డి భారతీయులు స్వదేశానికి తిరిగి రావడానికి, వసతి, ఆహారం సహాయం కోసం భారత హైకమిషన్‌లో నమోదు చేసుకున్నారు. సుమారు 5వేల మంది కరోనా పాజిటివ్‌ వచ్చిన భారత పౌరులు ఉండగా వీరిలో ఎక్కువ మంది విదేశీ కార్మికుల వసతి గృహాల్లో నివసిస్తున్నారు. ఏప్రిల్‌ చివరి వరకు కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు భారత హై కమిషనర్‌ తెలిపారు.

సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కరోనా పాజిటివ్‌ కేసులు 18,205నమోదయ్యా యి. 18మరణాలు సంభవించాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయితే భారతీయ కార్మికుల్లో దాదాపు అందరికీ స్వల్పస్థాయిలో లక్షణాలు ఉన్నాయని వారి పరిస్థితి మెరుగుపడుతోందని సింగపూర్‌ భారత్‌ హైకమిషనర్‌ జావేద్‌ అష్రాఫ్‌ మీడియాకు వెల్ల‌డించారు.