ఆసుపత్రిలో చేరిన మంత్రి బాలినేని

ఏపీ ఇంధన, అటవీ శాఖ మంత్రి బాలినేని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజుల క్రితం జరిపిన పరీక్షల్లో బాలినేనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది

ఆసుపత్రిలో చేరిన మంత్రి బాలినేని

AP Minister Balineni Srinivasa Reddy: ఏపీ ఇంధన, అటవీ శాఖ మంత్రి బాలినేని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజుల క్రితం జరిపిన పరీక్షల్లో బాలినేనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే తాజాగా  ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో తాను ఉన్నానని మంత్రి తెలిపారు. తనకు జ్వరం తప్ప మరే సమస్యలు లేవని ఈ సందర్భంగా బాలినేని వివరించారు. కాగా ఏపీలో పలువురు ప్రజాప్రతినిథులకు కరోనా సోకింది. వారిలో కొంతమంది కోలుకోగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా సోకిన మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాల రావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.

Read This Story Also: క్రేజీ కాంబో: త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య!

Click on your DTH Provider to Add TV9 Telugu