AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెకన్లలో కరోనా రిజర్ట్స్.. ఇజ్రాయెల్ సైంటిస్టుల పరిశోధనలు

కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. టెస్ట్ రిపోర్టు వచ్చే లోపే లోకం చుట్టేస్తుంది. కరోనా లక్షణాలు ఏమాత్రం లేకున్నా వైరస్ బారినపడుతున్నారు. కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాక కొన్నిసార్లు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు క్వారంటైన్ లో ఉండకుండా స్వేచ్ఛగా విహరిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. అయితే, కరోనా పరీక్షల అలస్యనికి చెక్ పెడుతూ ఇజ్రాయెల్ కొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

సెకన్లలో కరోనా రిజర్ట్స్..  ఇజ్రాయెల్ సైంటిస్టుల పరిశోధనలు
Balaraju Goud
|

Updated on: Aug 06, 2020 | 2:07 PM

Share

కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. టెస్ట్ రిపోర్టు వచ్చే లోపే లోకం చుట్టేస్తుంది. కరోనా లక్షణాలు ఏమాత్రం లేకున్నా వైరస్ బారినపడుతున్నారు. కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాక కొన్నిసార్లు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు క్వారంటైన్ లో ఉండకుండా స్వేచ్ఛగా విహరిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. అయితే, కరోనా పరీక్షల అలస్యనికి చెక్ పెడుతూ ఇజ్రాయెల్ కొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పదుల సెకన్లలోనే ఫలితాన్ని ఇవ్వగల అత్యంత వేగవంతమైన కరోనా పరీక్షా పద్ధతిని తీసుకువచ్చారు. ఇంకొన్ని నెలల్లోనే దీన్ని ఆవిష్కరిస్తామని ఇజ్రాయెల్‌ రక్షణశాఖ ప్రకటించింది. ఇందుకోసం భారత్‌ అందిస్తున్న సహకారాన్ని కొనియాడింది. భారత్‌లో ఎంపిక చేసిన ప్రాంతాల ప్రజల నుంచి 20వేలకుపైగా రక్త నమూనాలను సేకరించే ప్రక్రియను జూలై 26న ప్రారంభించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఆ శాంపిళ్లు ఇజ్రాయెల్‌కు చేరగానే.. వాయిస్‌ టెస్ట్‌, టెర్రా హెర్ట్జ్‌ తరంగాలతో శ్వాస విశ్లేషక పరీక్ష, ఐసోథర్మల్‌ టెస్టు, పాలీఅమైనో యాసిడ్‌ పరీక్షా పద్ధతుల ద్వారా విశ్లేషించే కసరత్తు మొదలవుతుందన్నారు. ఇందులో వచ్చే ఫలితాలే.. వేగవంతమైన కరోనా టెస్టుకు ప్రాతిపదిక కాబోతున్నాయని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఈ అధ్యయనం సత్ఫలితాలు ఇస్తందని.. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ పరికరాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపింది.

రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
ఓరీ దేవుడో.. రక్తంలా ఎరుపు రంగులోకి మారిన సముద్రం..! కారణం ఏంటంటే
ఓరీ దేవుడో.. రక్తంలా ఎరుపు రంగులోకి మారిన సముద్రం..! కారణం ఏంటంటే