ఏపీః మండ‌పేట ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్‌

తాజాగా మ‌రో ఏపీ ఎమ్మెల్యేకి కోవిడ్ సోకింది. తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌ట‌పేట ఎమ్మెల్యే జోగేశ్వ‌ర రావుకు క‌రోనా సోకింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే జోగేశ్వ‌ర రావు హైద‌రాబాద్‌లోని స్టార్ ఆస్ప‌త్రిలో చికిత్స..

  • Tv9 Telugu
  • Publish Date - 1:15 pm, Sun, 16 August 20
ఏపీః మండ‌పేట ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్‌

ఆంధ్ర ‌ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ‌క‌రోనా తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి, ఇప్ప‌టికే ఏపీలో 2.81 ల‌క్ష‌ల‌కు పైగానే కేసులు నమోద‌య్యాయి. ఇప్ప‌టికే ఎంతో మంది ప్రముఖులు, సెల‌బ్రిటీలు కూడా ఈ కోవిడ్ బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో ఏపీ ఎమ్మెల్యేకి కోవిడ్ సోకింది. తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌ట‌పేట ఎమ్మెల్యే జోగేశ్వ‌ర రావుకు క‌రోనా సోకింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే జోగేశ్వ‌ర రావు హైద‌రాబాద్‌లోని స్టార్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్టు స‌మాచారం. ఇక ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌రోనా పరీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు వైద్యులు.

ఇక ప్ర‌స్తుతం ఏపీలో కొత్తగా 8,732 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 2,81,817కి చేరింది. ఇందులో 88,138 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,91,117 రికవరీ కేసులు ఉన్నాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2562 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 10,414 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. 87 మంది మరణించారు. ఇక నేటి వరకు రాష్ట్రంలో 28,12,197 కరోనా టెస్టులు నిర్వహించారు.