కొత్త రికార్డు సెట్ చేసిన మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట‌

డైరెక్ట‌ర్ ప‌రశురామ్ ద‌ర్శక‌త్వంలో 'స‌ర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన సూప‌ర్ స్టార్ లుక్స్ కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో మ‌హాన‌టి చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ హీరోయిన్‌గా..

కొత్త రికార్డు సెట్ చేసిన మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 16, 2020 | 11:48 PM

ప్రిన్స్ మ‌హేష్ బాబు ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు మ‌హేష్. ఇక ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ ప‌రశురామ్ ద‌ర్శక‌త్వంలో ‘స‌ర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన సూప‌ర్ స్టార్ లుక్స్ కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో మ‌హాన‌టి చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

కాగా ఇక మే 31న సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా స‌ర్కారు వారి పాట మూవీ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. అయితే ఈ లుక్‌ని రిలీజ్ చేసిన అప్ప‌టిక‌ప్పుడే‌ ఫాస్టెస్ట్‌గా ల‌క్ష లైకులు సంపాదించిన పోస్ట‌ర్‌గా రికార్డును సృష్టించింది. ఇదే పోస్ట‌ర్ ఇప్పుడు మ‌రో రికార్డును సొంతం చేసుకుంది. అదేంటంటే ట్విట్ట‌ర్‌లో ఫాస్టెస్ట్ 50 వేల రీట్వీస్ట్ అందుకున్న పోస్ట‌ర్‌గా నిలిచింది. ఏదేమైన ఈ చిత్రానికి సంబంధించిన చిన్న అప్‌డేట్‌నే ఇంత బ‌జ్ క్రియేట్ చేస్తుంటే.. మ‌రి ఈ సినిమా విడుద‌ల‌కు ఎంత హంగామా షురూ అవుతుందో చూడాల్సిందే. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల అడ్డంకులు ఏర్ప‌డుతున్నాయి.

Read More:

ధోనీ పేరుతో జొమాటో అద్భుత‌మైన ఆఫ‌ర్‌

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్