కనిపించని హలీమ్.. ఈ సారి ఇలా కానిచ్చేయండి..
హలీమ్.. ఈ పేరు వింటేనే ఎవరికైనా నోరూరిపోతుంది. రుచికి రుచి.. శుచికి శుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందుకే ఆల్ ఇన్ వన్ హలీమ్ అంటే సకల జనులకు ఎంతో ప్రీతి. హలీమ్.. పేరుకు అరబ్ వంటకమైనా.. మేడిన్ హైదరాబాద్ హలీమ్ అంటే..

హలీమ్.. ఈ పేరు వింటేనే ఎవరికైనా నోరూరిపోతుంది. రుచికి రుచి.. శుచికి శుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందుకే ఆల్ ఇన్ వన్ హలీమ్ అంటే సకల జనులకు ఎంతో ప్రీతి. హలీమ్.. పేరుకు అరబ్ వంటకమైనా.. మేడిన్ హైదరాబాద్ హలీమ్ అంటే దునియా అంతా అస్సాలమ్ చేయాల్సిందే. హైదరాబాద్‌కు హలీమ్‌కు అంతటి అవినాభావ సంబంధం. హలీమ్‌కు ఓ రకంగా హైదరాబాద్ బ్రాండ్‌నేమ్.. నెల వంకతో ఎప్పట్లానే ఈసారి కూడా రంజాన్ మొదలైంది. ఇక చెప్పేదేముంది..! రంజాన్ వచ్చిందంటే అందరి చూపు హలీమ్ వంకనే.
ముస్లిమ్ సోదరసోదరీమణులే కాదు సకల జనులు హలీమ్‌కు సలామ్ కొట్టాల్సిందే. నిజానికి రంజాన్‌కు ముందే దునియా అంతటా హలీమ్ సందడి మొదలవుతుంది. కానీ కరోనా మూలాన ఈసారి హలీమ్ పత్తానే లేదు. పుట్టుపుర్వోత్తాలు ఏవైనా హలీమ్ అంటే అందరికీ క్రేజ్. చిన్నా పెద్దా అంతా హలీమ్ టేస్ట్‌కు ఫిదా అవ్వాల్సిందే. హలీమ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అనే లెవల్లో రంజాన్ టైమ్‌లో ఎంజాయ్ చేసే చిన్నారులెందరో. కానీ ఈసారి హలీమ్ కంటికి కూడా కన్పించడం లేదు.
కరోనా గత్తరతో హలీమ్ పేరు ఎత్తడానికే లేకుండా పోయింది. దీంతో హలీమ్ ప్రియుల గుండె బరువెక్కిపోతోంది. బజారులో బట్టీల్లేవు.. పిస్తా కౌన్ హై అని సవాల్ విసిరే హలీమ్ పోటీల్లేవ్. దునియా అంతా లాక్‌డౌన్. లాక్‌డౌన్‌లో ఇంట్లో వుండాలి.. ఇది హండ్రెడ్ పర్సెంట్ పాటించాల్సిన రూల్. ఇక ఇది పవిత్ర రంజాన్ మాసం. ఈ టైమ్‌లో తింటే హలీమ్‌నే తినాలి ఇందులో నో డౌట్. వాహ్వా.. ఏమి రుచి.. అంటూ మైమరిచి హలీమ్‌ను టేస్ట్ చేయాల్సిన సమయమే.. కానీ ఈసారి హలీమ్ తినే దారేది? హలీమ్ తినాలని సకల జనుల మనసు లాగేస్తోంది. మనసు వుంటే మార్గం వుంటాది. ఫికర్ మత్.. ఎంచక్కా ఇంట్లోనే హైజెనిక్ హలీమ్‌ను ప్రిపేర్ చేసుకుందాం. కరోనాను దూర్ కరో అంటూ దువా చేద్దాం.
Read More:
తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం
అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు
లాక్‌డౌన్ ఇప్పుడే కాదు.. నిజాం కాలంలోనూ ఉంది! అప్పుడేం చేసేవారంటే?



