ముందస్తు కొనుగోళ్లు.. మార్కెట్లు ఫుల్ బిజీ

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా కొనుగోళ్ల సందడే కనిపిస్తోంది. రోజు రోజుకూ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నందున మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు హోల్‌సేల్‌, రిటైల్‌ షాపులకు పరుగులు పెడుతున్నారు. నెల రోజులకు సరిపడా సరుకులను కొనుగోలు చేస్తున్నారు. అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ముందస్తుగా నిత్యావసర సరుకులు కొనుగోళ్లు చేస్తున్నారు. గత రెండు రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ ఉంటుందనే ప్రచారంతో ప్రజలు […]

ముందస్తు కొనుగోళ్లు.. మార్కెట్లు ఫుల్ బిజీ
Follow us

|

Updated on: Jul 02, 2020 | 6:23 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా కొనుగోళ్ల సందడే కనిపిస్తోంది. రోజు రోజుకూ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నందున మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు హోల్‌సేల్‌, రిటైల్‌ షాపులకు పరుగులు పెడుతున్నారు. నెల రోజులకు సరిపడా సరుకులను కొనుగోలు చేస్తున్నారు. అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ముందస్తుగా నిత్యావసర సరుకులు కొనుగోళ్లు చేస్తున్నారు. గత రెండు రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ ఉంటుందనే ప్రచారంతో ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలతో ఏపీవాసులు అలర్ట్ అయ్యారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుంటుందనే భయంతో జనాలు ఏపీకి క్యూ కట్టారు. సోమవారం నుంచి జనాలు సొంత ఊళ్లకు బయల్దేరారు.