లాక్‌డౌన్ ముగిసిన తర్వాత చేయకూడని డేంజర్ పనులు ఇవే

లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారా అని ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి?

లాక్‌డౌన్ ముగిసిన తర్వాత చేయకూడని డేంజర్ పనులు ఇవే
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 6:59 PM

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పటికీ ఈ వైరస్‌కి మందు కనిపెడతూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మన దేశంలో లాక్‌డౌన్ విస్తరించిన తర్వాత కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే లాక్‌డౌన్‌ను మే నెల 3వ తేదీ వరకూ పొడిగించారు ప్రధాని మోదీ. అయితే తాజాగా ఈ నెల 27వ తేదీన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ప్రధాని. ముఖ్యంగా ఈ సమావేశంలో లాక్‌డౌన్ ఎత్తివేతపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ సమయంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే కనుక మంచి కన్నా.. చెడే ఎక్కువ జరిగే అవకాశముంది. ఎందుకంటే జనం ఒక్కసారిగా రోడ్లమీదకి ఎగబడతారు. దీంతో ఇంతకాలం చేసిందంతా.. బూడిదలో చేసిన పన్నీరులా అయిపోతుంది. అందుకే దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోనుంది కేంద్రం.

కాగా మరోవైపు లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారా అని ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ముగిసిన తర్వాత చేయకూడని డేంజర్ పనులు ఇవే:

1. లాక్‌డౌన్ అయిపోయింది కదా అని ఏ వెకేషన్స్‌కీ ప్లాన్ చేసుకోకూడదు 2. అలాగే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం మానేయకూడదు 3. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ఉండాలి 4. లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఎలాంటి క్లబ్బులు, బార్స్‌కి వెళ్లకూడదు 5. వీలైనంతవరకూ బయటి ఫుడ్‌ని తినకపోవడమే మంచిది 6. ఇంట్లోని పెద్ద పెద్ద పార్టీలు నిర్వహించకూడదు 7. ఇప్పటివరకూ పాటించిన నియమాలే తర్వాత కూడా పాటిస్తే కరోనాపై ఎప్పటికీ మనం విజయం సాధించినట్టే అవుతుంది.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్