ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా విజృంభణ… 800 దాటిన కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 45వేలు దాటింది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1296 కరోనా కేసులు నమోదుకాగా, ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45076కి పెరిగింది. ముఖ్యంగా

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 45వేలు దాటింది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1296 కరోనా కేసులు నమోదుకాగా, ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45076కి పెరిగింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువగా నమోదవుతున్న కోరనా కేసుల సంఖ్య ఇప్పుడు జిల్లాలకు కూడా విస్తరిస్తోంది. జిల్లాలను వెంటాడుతున్న కరోనా ప్రజల్ని వణికిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్యం 800 దాటినట్లుగా అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కోవిడ్ పంజా విసురుతోంది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్,జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో వైరస్ వ్యాప్తి శర వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో 40 కేసులు నమోదైనట్లుగా వైద్య శాఖ వెల్లడించింది. కలుపుకొని జిల్లాలో మొత్తం కేసుల సంఖ్యం 800 దాటింది. నారాయణపేట జిల్లాలో ఆదివారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇకపోతే, తెలంగాణలో కరోనా డిశ్చార్జ్ రేటు మాత్రం అత్యధికంగా ఉందని, అదొక్కటే ఊరటనిచ్చే అంశంగా వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.




