కామారెడ్డి జిల్లా బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల సమయంలో విషాదం చోటుచేసుకుంది. బయటి నుంచి తెచ్చిన కుర్చీలను దించుతుండగా ఎనిమిదో తరగతి విద్యార్థిని సంగీత ఆటో కింద పడి దుర్మరణం పాలైంది. ఈ ఘటనతో పాఠశాలలో, విద్యార్థిని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.