AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చక్కెర , బెల్లం లేకుండా డ్రై ఫ్రూట్ లడ్డూ.. ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలంటే?

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అందుకే ఆహారం విషయంలో తప్పక జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా శరీరానికి శక్తిని ఇచ్చే ఫుడ్ తీసుకోవాలంట. అందులో ముఖ్యమైనది చక్కెర , బెల్లం లేకుండా తయారు చేసే డ్రై ఫ్రూట్ లడ్డూ తినడం వలన అనేక లాభాలు ఉన్నాయంట. కాగా, దీనిని ఎలా చేయాలో చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 26, 2026 | 2:44 PM

Share
కావాల్సిన పదార్థాలు : ఖర్జూరం మూడు కప్పులు, బాదం పప్పు రెండు కప్పులు, జీడిపప్పు కప్పు, పిస్తా , ఒక కప్పు, వాల్ నట్స్ పావు కప్పు, కిస్‌మిస్ రెండు టేబుల్ స్పూన్స్ , గసగసాలు రెండు టేబుల్ స్పూన్స్, ఎండుకొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి వన్ టీ స్పూన్, నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే, ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత దానిపై పాన్ పెట్టి అందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేసి, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, వంటివి వేయించుకోవాలి. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.తర్వాత ఖర్జూరాలను ఒక బౌల్‌లోకి తీసుకొని, శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత అందులో ఉన్న గింజలు తీసివేయాలి. తర్వాత వాటిని మిక్సీజార్‌లో వేసుకొని మెత్తగా గ్రైడ్ చేసుకోవాలి. వీలైతే ఇందులో రెండు నుంచి ఐదు అంజీర్ పండ్లను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.

2 / 5
ఈ మిశ్రమం చాలా మెత్తగా పేస్ట్‌లా అవుతుంది.  తర్వాత దీనిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో తక్కువ మంటపై గస గసాలు వేయించుకోవాలి. ర్వాత ఎండు కొబ్బరి తురుము కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
తర్వాత అదే పాన్‌లో వన్ టీ స్పూన్ నెయ్యి వేసి, దానిలో ఖర్జూర పేస్ట్ వేసి వేయించుకోవాలి. పేస్ట్ ముద్దగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమంలో డ్రై ఫ్రూట్ ముక్కలు,గసగసాలు, ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి.

4 / 5
దీని తర్వాత ఈ మిశ్రమం చల్లారిన తర్వాత గోరు వెచ్చగా ఉన్న సమయంలో చిన్న చిన్న లడ్డూలగా చుట్టుకోవాలి. అంతే చక్కెర , బెల్లం లేకుండా టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డూ రెడీ, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

5 / 5